ఏపీ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు ఫలితాలు విడుదల

-ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి 
-జూలై 27 నుండి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు ఫీజులు చెల్లింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ) ఆధ్వర్యంలో జరిగిన పదో తరగతి, ఇంటర్మీడియెట్ ప్లబిక్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదల చేసినట్లు ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి  ప్రకటనలో తెలిపారు.  జూన్ 26 నుండి జూలై 4 వరకు నిర్వహించిన ఈ పబ్లిక్ పరీక్షల ఫలితాలను www.apopenschool.ap.gov.in వెబ్ సైటులో పొందుపరిచామని, విద్యార్థులు ఈ  వెబ్ సైటు నుండి మార్కుల మెమోలు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

ఎస్సెస్సీలో, ఇంటర్లో బాలికలదే పైచేయి
పదో తరగతి పరీక్షలకు 13,320 మంది విద్యార్థులు హాజరు కాగా 7,619 మంది (57.20%) ఉత్తీర్ణత సాధించారన్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలకు 25,097 మంది హాజరుకాగా 15,676 మంది (62.46%)  ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.  పదో తరగతిలో బాలికల ఉత్తీర్ణత శాతం 52.60 కాగా, బాలురు 41.75 శాతం సాధించారని,  ఇంటర్మీడియెట్లో  బాలికలు 65.32 శాతం ఉత్తీర్ణత శాతం సాధించగా,  బాలురు 60.92 శాతం రెండో స్థానంలో నిలిచారని తెలిపారు.

పదో తరగతిలో 88.19%తో కాకినాడ జిల్లా ముందంజలో ఉండగా,  16.83%తో ఎన్టీఆర్ జిల్లా చివరిస్థానంలో ఉంది.   ఇంటర్మీడియెట్లో  84.68 %తో తూర్పు గోదావరి ముందంజలో ఉండగా,  41.71% ఉత్తీర్ణతతో పశ్చిమగోదావరి అత్యల్పంగా నిలిచింది.

రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు ఫీజులు చెల్లింపు
జూలై 27 నుండి ఆగస్టు 4వ తేదీవరకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు  సంబంధించిన ఫీజుల చెల్లించవచ్చని తెలిపారు. దీనికి సంబంధించిన రుసుము  ఏపీ ఆన్ లైన్లో చెల్లించవచ్చని, ప్రత్యేకమైన అభ్యర్థనలు పంపనవసరం లేదని ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డిగారు పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *