– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అజిత్ సింగ్ నగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆగష్టు 1 నుంచి ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ తరగతులు నిర్వహించనున్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ఇందుకోసం కేంద్ర ఆయుష్ విభాగం ఒక యోగా ట్రైనర్ ని కూడా ప్రత్యేకంగా నియమించినట్లు తెలిపారు. యోగాసనాలతో పాటు ఆరోగ్య సూత్రాలను కూడా వివరించడం జరుగుతుందన్నారు. కనుక ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవలసిందిగా సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. సమాచారం కోసం 7627848484 నెంబర్ ని సంప్రదించవలసిందిగా తెలియజేశారు.