ఘనంగా పర్యావరణ పరిరక్షణ దినోత్సవం…

-జిల్లా వ్యాప్తంగా 9,555 మొక్కలు నాటిన అధికారులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడానికి దోహదపడతారని డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌ అన్నారు.
ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, అధికారులు సిబ్బందితో కలిసి నగరంలోని సబ్‌ కలెక్టరేట్‌ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
కలెక్టరేట్‌ ప్రాంగణంలో జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్‌కుమార్‌ కలెక్టరేట్‌ వివిధ సెక్షన్‌ అధికారులు సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.
జిల్లా నీటి యజమాన్య సంస్థ సిబ్బంది ఆధ్వర్యంలోని ప్రాంగణంలో డ్వామా పిడి జె. సునీత, సిబ్బదితో కలిసి మొక్కలు నాటారు.
జిల్లా వ్యాప్తంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఎయస్‌ అధికారుల సతీమణుల సంఘం (ఐఎయడబ్ల్యుఎ) రాష్ట్ర వ్యాప్తం గా మొక్కలు నాటడానికి పిలిపు నిచ్చింది. అందులో భాగంగా అడవులు, జీవనోపాధులు, ప్రజలు, భూమి సుస్థిరత అన్న భావనతో జిల్లా కలెక్టర్‌ ఢల్లీిరావు మార్గదర్శకత్వం లో జిల్లా వ్యాప్తంగా కార్యాలయాల ప్రాంగణంలో విరివిగా మొక్కలు నాటారు. గ్రామపంచాయతీ, జిల్లా నీటి యజమాన్య సంస్థ సిబ్బంది ఆధ్వర్యంలో వివిధ గ్రామాలలో 7,155 మొక్కలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, రోడ్డుకిరువైపుల, కాలువ కట్టలు, ఖాళీ ప్రదేశాల్లో నాటారు. అలాగే విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ లో 2,000, నాలుగు మున్సిపాలిటి లలో 400 మొక్కలు చొప్పున జిల్లా మొత్తంలో 9,555 మొక్కలు నాటారు. నాటిన మొక్కల్లో నేరేడు, గానుగ, ఉసిరి, జామ, తెల్లమద్ది రకాలున్నాయి. మొక్కలను జిల్లా అటవీ శాఖ నుంచి సేకరించారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన మొక్కలు నాటే కార్యక్రమల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళాధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున చురుకుగా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *