విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మణిపూర్ సంఘటనను పురస్కరించుకుని నిరసనగా 3 రోజులు సత్యాగ్రహ నిరాహారదీక్షను గాంధీదేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ ప్రారంభించారు. మంగళవారం పశ్చిమ నియోజకవర్గంలో ఊర్మిళానగర్‌లోని గాంధీ ట్రస్ట్ కార్యాలయంలో ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ స్త్రీ రక్షణలేని స్వాతంత్య్రం, స్వాతంత్య్రం కానేకాదన్నారు. ఇది జాతి పతాకం కాదు. జాతీయ పతాకమన్నారు. 2014 ముందు స్వతంత్య్రాన్ని కోల్పోయామన్నారు. మరి గాంధీ స్వతంత్య్రాన్ని పొందేదెప్పుడు అని ప్రశ్నించారు. మణిపూర్ మంటలో మన స్వాతంత్య్రాన్ని మట్టి కరిపించారన్నారు. భారత్ మాతాకీ జై అంటారు. భారత స్త్రీలను అవమానిస్తున్నారన్నారు. 33 శాతం శాతం రిజర్వేషన్ కన్నా గొప్ప రక్షణ ఎక్కడుంటిందన్నారు. మన ప్రధాని మణిపూర్ ఘటనపై ప్రాయాశ్చితం చేసుకోవాలంటే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుపరచాలన్నారు. అన్ని మతాల వారు తమ తమ ఆచార సాంప్రదాయాల ప్రకారం దేవాలయాలు, మసీదు, చర్చిలలో పూజలు నిర్వహించి అనంతరం బయటకు వచ్చి మానవత్వం నెలకొల్పే విధంగా నినాదాలు పలకాలన్నారు. స్వాతంత్య్రం దాహంతో ఉద్యమించాలి. నిజమైన స్వాతంత్య్రాన్ని నెలకొల్పండని పిలుపునిచ్చారు. మణిపూర్‌లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుని మహిళల మాన ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్‌ల ఆశయాల సాధనకు ప్రజలు నడుంకట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా స్వామ్య పరిరక్షణ ప్రజలందరి బాధ్యతని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ దేశం ట్రస్ట్ మహిళా అధ్యక్షురాలు ఆర్‌ఎన్.శివరంజని, ట్రస్ట్ ఏపీ అధ్యక్షురాలు బి.భారతి, ఆశ్రమ సిబ్బంది, విద్యార్థినీ విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawda
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …