పంట నష్ట పోయిన రైతులను ఆదుకునేందుకు అవసరైన అన్ని చర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పంట నష్ట పోయిన రైతులను ఆదుకునేందుకు అవసరైన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
గంపలగూడెం మండలం ఊటుకూరు శ్రీ లక్ష్మి తిరుపతమ్మ నర్సరీకి చెంది పంట నష్టపోయిన రైతులు, వ్యవసాయ, ఉద్యాన, వివిధ శాఖ అధికారులతో బుధవారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ 2016-2017 సంవత్సరంలో లక్ష్మి తిరుపతమ్మ నర్సరీకి చెందిన 33 మంది రైతులు 66 ఎకరాలలో నకిలీ విత్తనం, నారుతో మిర్చి పంట నష్టపోయిన్నట్లు రైతులు అభియోగం చేయడం జరిగిందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలించి రైతులకు తగు న్యాయం చేయడం జరుగుతుందని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు. సమావేశంలో లక్ష్మి తిరుపతమ్మ నర్సరీకి చెందిన రైతులను జరిగిన నష్టంపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎకరాకు రావాల్సిన దిగుబడి రాక నష్టపోయామని ఎకరాకు కనీసం 20 నుండి 25 క్వింటాళ్ళు దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 10 నుండి 15 క్వింటాళ్ళు మాత్రమే దిగుబడి రావడం జరిగిందని కలెక్టర్‌ డిల్లీరావుకు వివరించారు.
సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి ఎస్‌ నాగమణెమ్మ, ఉద్యాన శాఖ అధికారి పి. బాలాజీకుమార్‌, వ్యవసాయ శాఖ సహయ సంచాలకులు అనితాబాను, ఎవో ఊర్మిళ, శాస్త్రవేత సి. శారద, రైతు ప్రతినిధి జి.ఎస్‌ ఆర్‌కె ప్రసాద్‌, రైతు సంఘం నాయకులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *