200 ఏళ్లు బ్రిటిషర్ల పాలనలో దోపిడీకి గురై అస్తవ్యస్తమైన భారతావనిని స్వాతంత్ర అనంతరం ఏకతాటిపైకి నడిపించడంలో రాజ్యాంగం కీలక భూమిక పోషించిందని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె.శివ లక్ష్మీ జ్యోతి అన్నారు.

గుంటూరు,నేటి పత్రిక ప్రజావార్త :
200 ఏళ్లు బ్రిటిషర్ల పాలనలో దోపిడీకి గురై అస్తవ్యస్తమైన భారతావనిని స్వాతంత్ర అనంతరం ఏకతాటిపైకి నడిపించడంలో రాజ్యాంగం కీలక భూమిక పోషించిందని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె.శివ లక్ష్మీ జ్యోతి అన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ స్వాతంత్రం లభించిన రెండేళ్ల తర్వాత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26 నాటి రాజ్యాంగ పరిషత్‌లో ఆమోదించి, 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమలు చేసుకుంటున్నామని, ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం ప్రదాన స్థానంలో ఉంటుందన్నారు. రాజ్యాంగం వలనె సమాన హక్కులు ప్రతి ఒక్కరికి దక్కాయని అటువంటి రాజ్యాంగ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన అంబేద్కర్ సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. అనంతరం రాజ్యాంగ ప్రవేశికను చదివారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, బి.శ్రీనివాసరావు, మేనేజర్ శివన్నారాయణ, సూపరిండెంట్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *