కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 167వ రోజు కొవ్వూరు రూరల్ ఆరికిరేవుల గ్రామంలో హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత పర్యటించారు. ఆదివారం సాయంత్రం డాక్టర్ బీ.ఆర్. అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల్పించి గ్రామంలో గడప గడపకు ప్రారంభించారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి బాగోగులను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా వారి కుటుంబాలకు ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని కుటుంబ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, అర్హత ఉండి ఏ సంక్షేమ పధకం అందకపోయిన తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రజల వద్దకు వెళ్తుంటే జగనన్న పాలన గురించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అవినీతి రహిత పాలన అందించడమే కాకుండా మీకు అందరికీ తోడు నీడగా నిలుస్తున్న జగనన్నకి మీరంతా బాసటగా నిలవాలని, మీ అందరి దీవెనలు, ఆశీర్వాదాలు అందచేయాలన్నారు. మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ని చేయాలని ఆమె కోరారు. . సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా అందరికీ సంక్షేమం అందిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలను ఇళ్ల వద్దకే చేరుస్తున్న ఘనత జగన్ దే హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
Tags kovvuru
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …