Breaking News

మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటా…

-ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెల్లడి
-కందులపాడులో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు
-రూ.63 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

జి.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటానని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. జి.కొండూరు మండలం కందులపాడు గ్రామంలో ఆయన శుక్రవారం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. రూ.33 లక్షలతో జల్ జీవన్ పథకం కింద ఇంటింటికీ రక్షిత మంచినీటి సరఫరాకు నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును, రూ.30లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు.

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు అభివృద్ధి పనులకు రూ.300 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మైలవరం నియోజకవర్గంలో 30 కమ్యూనిటీ హాళ్లు, 20 సొసైటీ భవనాలు, గోడౌన్లు, 20 వేల పైచిలుకు ఇంటిపట్టాలు, 25వేల పక్కాగృహాలు, రూ.25 కోట్లతో డ్రెయిన్ల నిర్మాణం, రూ.35 కోట్లకు పైగా నిధులతో రహదారుల నిర్మాణం, 55 సచివాలయాలకు భవన నిర్మాణాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్ నెస్ సెంటర్లు, ఇబ్రహీంపట్నం, కొండపల్లిలలో అర్బన్ హెల్త్ సెంటర్లు, మైలవరంలో రూ.3కోట్లతో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి నూతన భవనం నిర్మాణం పూర్తి చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *