విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రెండవ సాధారణ ఎన్నికలు–2026 నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విజయవాడ నగరం లో ఓటు హక్కు కలిగి ఉండి, పోలింగ్ నాడు అనగా 01-11-2026 న ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది, తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు.
మొగల్రాజపురంలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఇండోర్ స్టేడియం, ధ్యాన్ చంద్ బ్లాక్ లో అక్టోబర్ 29, 30 వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ పోలింగ్ రోజున అనగా (01-11-2026) న ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అందరూ పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఎన్నికల విధులకు సంబంధించి జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను మరియు ఓటరు గుర్తింపు కార్డు తీసుకొని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను సంప్రదించాలని సూచించారు.
