విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలకు ముందు వైకాపాలో చేరి ఓటమిపాలైన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ ప్రయాణాన్ని ముగించినట్లు ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. జాగ్రత్తగా ఆలోచించాకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. రెండుసార్లు ఎంపీగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపమైన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉన్నా విజయవాడ అభివృద్ధికి మద్దతు ఇస్తూనే ఉంటానన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …