Breaking News

గత ప్రభుత్వం జిపియస్ అమలుపై ఇచ్చిన జిఓ ను నిలుపుదల చేయాలని సియం ఆదేశాలపట్ల ఏపిజేఏసి అమరావతి హర్షం

అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వం, వారు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపియస్ ను రద్దు చేస్తామని హామి ఇచ్ఛి ఐదేళ్లు పాటు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, ఏపీ జేఏసీ అమరావతి 92 రోజుల ఉద్యమం తర్వాత, ప్రభుత్వ కాలపరిమితి పూర్తవుతున్న సమయంలో “అప్పట్లో అవగాహనలేక సిపియస్ రద్దు చేస్తామని హామి ఇచ్చామని”, అది ప్రస్తుతం సాద్యం కాదని చెప్పి, గత ప్రభుత్వం బలవంతంగా జిపియస్ ను ప్రవేశపెట్చినప్ఫుడు అన్ని ఉద్యోగసంఘాలు ప్రధానంగా సీపీఎస్ ఉద్యోగ సంఘాలు చేసిన అభ్యంతరాలపై మరళా ఉద్యోగసంఘాలతో చర్చించి, తుధినిర్ణయాలు తీసుకుంటామని హామి ఇచ్చి, ఎన్నికల నోటిఫికేషన్ లోపు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోగా, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అనగా 12.6.2024 తేదీతో ఆర్థిక శాఖ ప్రధాన అధికారి పేరుతో ఉత్తర్వులు ఇవ్వడం దుర్మార్గం. ఏ శాఖ ఉన్నతాధికారైనా….
పాత ప్రభుత్వ హయంలో ఏదైనా నిర్ణయం తీసుకుని, సదరు నిర్ణయం పై ఎన్నికల నోటిఫికేషన్ లోపు ఉత్తర్వులు జారీ కాకపోతే, కొత్తగా వచ్చిన ప్రభుత్వ అనుమతితో మాత్రమే ఉత్తర్వులు ఇవ్వాలని రూల్స్ స్పష్టంగా చెబుతున్నప్పటికీ, ఈ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేకుండా తేదీ 12.6.2024 న గుట్టు చప్పుడు కాకుండా ఉత్తర్వులు జారీ చేయడం రూల్స్ కు వ్యతిరేకం.

ఉద్యోగులలో గందరం గోళం కలిగేలా జిపియస్ అమలుపై ఇచ్చిన దొంగచాటుగా ఇచ్చిన జీ.ఓ విషయం ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళగానే, తక్షణమే స్పందించి ప్రస్తుతం అఫ్ లోడ్ చేసిన జిపియస్ పై జీ ఓ (గెజిట్) ను నిలుపుదల చేయాలని, దీనిపై సంబందిత శాఖద్వారా వెంటనే విచారణ జరపాలని ఈ రోజు సోమవారం ఆదేశాలు ఇవ్వడం పట్ల ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,సెక్రటరీజెనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారి వి.వి.మురళికృష్ట నాయుడు సోమవారం ఒక ప్రకట ద్వారా హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల ప్రధానంగా సిపిఎస్ ఉద్యోగులను మానసిక ఆందోళన నుండి విముక్తి కలిగించినందుకు ముఖ్యమంత్రి కి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *