విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గం బిజెపి కార్యాలయంలో రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సృజనా చౌదరి చేతుల మీదుగా జరిగినది ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలోని మహిళలకు ఆర్థిక పరిపుష్టి స్వాలంబనకు పదివేల కుట్టు మిషన్ల పంపిణీ తో పాటు కుట్టు మిషన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఈ కేంద్రాలలో స్వచ్ఛంద సంస్థల వారు పంపిణీ చేసే సేవా కార్యక్రమాల దుస్తులను ఈ కుట్టు మిషన్ కేంద్రాల ద్వారా కుట్టించి వాటి కుట్టు ఆదాయాన్ని మహిళలకు వచ్చే విధంగా రూపకల్పన చేస్తున్నట్టు శాసనసభ్యులు తెలిపారు ఈ నిర్ణయాన్ని 49వ డివిజన్ నుండి హాజరైన మహిళా మణులు ముక్తకంఠంతో హర్షాతిరేకాలు వెలిబుచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నాగుల్ మీరా, MS బేగ్, అడ్డురి శ్రీరామ్ ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు, బుల్ల విజయకుమార్, 49 వ డివిజన్ కార్పొరేటర్, బొమ్మసాని సుబ్బారావు, మాజీ కార్పొరేటర్ యాదుపాటి రామయ్య మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News