Breaking News

జిపిఎస్ అమలు పై దొంగ చాటుగా ఇచ్చిన జీవో ని నిలుపుదల చేసిన ముఖ్యమంత్రి ఆదేశాలపై APJAC, NGGO సంఘ్o హర్షం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సిపిఎస్ ఉద్యోగులు ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ, వారి మీద 1500 పైగా కేసులు పెట్టి, జిపిఎస్ అమలకై అక్టోబర్ 2023లో యాక్టును తీసుకొచ్చి బలవంతనా ఉద్యోగుల మీద రుద్దిన గత ప్రభుత్వo తదుపరి ఎన్ని సమావేశాలు నిర్వహించినప్పటికీ ఉద్యోగుల అభ్యంతరాల పై ఏమాత్రం స్పందించలేదు.

పైపెచ్చు అప్పటి రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రధాన అధికారి ఇప్పటి నూతన ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయకముందే, 12 జూన్ 2024న గెజిట్ నెంబర్ 296 ద్వారా జిపిఎస్ అమలు తేదీని 20 అక్టోబర్ 2023గా నిర్ధారిస్తో దొంగ చాటుగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీని మీద ఉద్యోగ సంఘాలు సిపిఎస్ సంఘాలు ఉద్యోగులు ఆందోళన చెందిన మీదట, సమస్యను అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి మన ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఏపీ జేఏసీ వర్షం ప్రకటిస్తుంది.

నూతన ప్రభుత్వం ఏర్పడుతున్న సమయంలో, ఇటువంటి గందరగోళపు గజెట్ లు దొంగ చాటుగా జారీ చేయటం సమంజసం కాదని, దానికి కారణమైన ఆర్థిక శాఖ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించడం సంతోషదాయకమని ఏపీ జెఎసి చైర్మన్ ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి శివారెడ్డి, ఏపీ జెఎసి సెక్రెటరీ జనరల్ జి హృదయ రాజు, ఎన్జీవో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తమ నాయుడు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.

ఉద్యోగుల ఆందోళన, దీనివల్ల ఏర్పడిన గందరగోళాన్ని నివారిస్తూ ప్రభుత్వం విను వెంటనే ఇటువంటి చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కి ఏపీ జెఎసి పక్షన ధన్యవాదములు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *