Breaking News

విద్యార్థులు కు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నాయుడు పేట గురుకుల విద్యార్థులు కలుషిత ఆహారం వల్ల అస్వస్థత గురైన విద్యార్థులు ను నాయుడు పేట, గూడూరు ఆసుపత్రి లకు తరలించారు.ఈ విషయం పై ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ వైద్య అధికారులు తో మాట్లాడి వైద్యం అందుతున్న సమాచారం తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.మెరుగైన వైద్యం అందించడానికి సకాలంలో చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. ఎప్పటి కప్పుడు వారి కి అందుతున్న వైద్య సేవలు తెలియచేయాలని మంత్రి సంబంధించిన అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శ చేశారు.అనంతరం కలెక్టర్ వెంకటేష్, జిల్లా వైద్యాధికారి శ్రీ హరి లతో వివరాలు తెలుసుకుని ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ కు వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *