అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఇటీవల ఎన్నికైన ఇద్దరు అభ్యర్థులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సి. రామచంద్రయ్య, పిడుగు హరి ప్రసాద్ లతో శాసన పరిషత్తు చైర్మన్ కొయ్యే మోషేను రాజు తన కార్యాలయంలో నేడు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి అభినందనలు తెలుపుతూ, శాసన పరిషత్తు నియమ నిబంధనల పుస్తకాలను నూతన ఎమ్మెల్సీలకు చైర్మన్ అందజేశారు. సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర కార్యక్రమం నిర్వహించగా శాసన మండలి సభ్యులు పంచుమర్తి అనురాధ, జాయింట్ సెక్రటరీ ఎం. విజయ రాజు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …