-గన్నవరం నుంచి విమాన సర్వీసులు పెంచండి
-కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడుకు టీడీపీ నేత డూండీ రాకేష్ వినతి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశ, విదేశీ విమాన సర్వీసులు పెంచాలని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడుకు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ విజ్ఞ ప్తి చేశారు. శుక్రవారం ఢల్లీిలో కేంద్రమంత్రిని కలిసిన ఆయన ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు. ఏపీలో పౌర విమానయాన అభివృద్ధికి సహకరించాలని కోరారు. విజయవాడ నుంచి వారణాసి వయా విశాఖపట్నం, విజయవాడ నుంచి కోల్కత్తా, విజయవాడ నుంచి అహ్మదాబాద్, బెంగుళూరు, పూణె, ముంబైకు కొత్త సర్వీసులు ప్రారంభించాలని కోరారు. అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ మీదుగా దుబాయ్‌కి విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.