Breaking News

ధ్వంశమైన వ్యవస్థలను బలోపేతం చేసేందుకే అధికారంలోకి వచ్చాము

-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి & పిఆర్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పరిపాలనా పరంగా రాష్ట్రంలో సమూల మార్పు కోసమే రాష్ట్ర ప్రజలు పూర్తి మెజారీతో తమ కూటమికి అధికారాన్ని కట్టబెట్టారని, వారి ఆశలు, అభిరుచులకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్లు అందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అద్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పూర్తి స్థాయిలో వ్యవస్థలను ధ్వంశం చేసిందని, ధ్వంశమైనటువంటి వ్యవస్థలను అన్నింటినీ బ్రతికించేందుకు, బలోపేతం చేసేందుకు ఎన్నో ఒడిదుడులు ఎదుర్కొని అధికారంలోకి వచ్చామన్నారు. డా.బాబా సాహెబ్ అంబేద్కర్ రంచించిన బలమైన రాజ్యాంగాన్ని గత పాలకులు అన్ని విధాలుగా నిర్వీర్యం చేస్తూ ఐఎఎస్, ఐపిఎస్ వ్యవస్థను పూర్తి స్థాయిలో చిధ్రం చేశారని, ఎవరినీ పనిచేయకుండా చేశారన్నారు. ఇటు వంటి పరిస్థితుల్లో ఎంతో అనుభవజ్ఞడైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం, ఆయన చేసే దిశా నిర్థేశం, వారి సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. వారి అపార అనుభవాన్ని, పరిపాలనా విధానాన్ని, దక్షతను నేర్చుకునేందుకు తనతో పాటు మంత్రి వర్గం అంతా సిద్దంగా ఉందన్నారు. 2047 కల్లా భారత దేశం సూపర్ పవర్ కావాలనే లక్ష్యంలో భాగం వికసిత్ ఆంధ్రదేశ్ కూడా ముందుకు వెళ్లాలంటే జిల్లా కలెక్టర్లతో పాటు అన్ని వర్గాల ప్రజలు హకరించాలని ఆయన కోరారు.

రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకూ ఎవరూ చేయని విధంగా రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖకు సంబందించి ఈ ఏడాది ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయితీల్లో ఉపాధి హామీ పథకం అమలుపై పలు తీర్మానాలు చేస్తూ గ్రామ పంచాయితీలను బలోపేతం చేసే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. అందుకు జిల్లా కలెక్టర్లు అంతా పూర్తి స్థాయిలో సహకించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2014-19 మధ్య కాలంలో దాదాపు 10 వేల గ్రామ పంచాయితీల్లో ప్రారంభించిన ఘన వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. పిఠాపురం నియోజక వర్గంలో గ్రే వాటర్ మేనేజ్మెంట్ విధానం ద్వారా లిక్విడ్ వేస్టు మేనేజ్మెంట్ విధానాన్ని అధునాత పద్దతిలో పైలెట్ ప్రాజక్టుగా నిర్వహించేందుకు ప్రాధాన్యత నిస్తున్నట్లు తెలిపారు. స్వచ్చభారత్ మిషన్, ఇతర పథకాల క్రింద నిర్మించిన వ్యక్తి గత మరుగుదొడ్లను ఓడిఎఫ్ ప్లస్ క్రింద నిర్వహించనున్నట్లు తెలిపారు. జల్ జీవన్ మిషన్ క్రింద ప్రతి గృహానికి సురక్షిత త్రాగు నీటిని సరఫరా చేసేందుకు ఈ నెల 15 నుండి పల్స్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది గ్రామ పంచాయితీల్లో 5 కోట్ల 40 లక్షల ట్యాప్ కనెక్షన్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని నిర్థేశించుకోవడం జరిగిందన్నారు. దీనావస్థలో ఉన్న గ్రామీణ రోడ్ల పరిస్థితులను మెరుగుపర్చడంతో పాటు దాదాపు 4,729 కి.మి. మేర నూతన రోడ్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రంలో 29.23 శాతం మేర 37,431 చదరపు కి.మి. నోటిఫైడ్ అటవీ ప్రాంతం ఉందని, ఆ ప్రాంతానికి బయట 10,221 చదరపు కి.మి. పచ్చదనం విస్తరించి ఉన్న ప్రాంతంలో పాటు చెరువు తీరాలు, కొండ ప్రాంతాలు, పంచాయితీ భూములు, పలు సంస్థల భూముల్లో కూడా పచ్చదనాన్ని అభివృద్ది పర్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గుంటూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అటవీ ప్రాంతం చాలా తక్కువ ఉందని, ఆయా ప్రాంతాల్లో అటవీ ప్రాంతాన్ని విస్తరింపచేసేందుకు వ్యూహత్మంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అందుకు గాను అటవీ ప్రాంతాలను పరిరక్షించడం, ఆక్రమణలను తొలగించడం, చట్టవ్యతిరేక కార్యక్రమాలను నియంత్రించడం తదితర చర్యలు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్లు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన కోరారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *