విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఘనంగా శారద (ఇంటర్మీడియట్) విద్యా సంస్థల 10 వసంతాల ‘ఫ్రెషర్స్ డే’ వేడుకలు జరిగాయి. శనివారం బందరురోడ్డులోని ఎ ప్లస్ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె.జి.వి. సరిత మాట్లాడుతూ నేటి సమాజానికి విలువలతో కూడిన విద్య అవసరమని, శారద విద్యా సంస్థలు చక్కటి విలువలతో కూడిన విద్యను అందిస్తుందని అభినందించారు. విద్యార్థి ఉజ్జ్వల భవిష్యత్తును రూపొందించే కేంద్రాలుగా ఉన్నటువంటి కళాశాలలను ప్రతి విద్యార్థి తప్పనిసరిగా సద్వినియోగపరుచుకుని, ఉన్నత విద్యలతో మహోన్నత పదవులను అధిరోహించి, ధర్మబద్ధతతో కూడిన సేవలను సమాజానికి అందించాలని సూచించారు. గౌరవ అతిధులు ప్లానింగ్ కమీషన్ ఫార్మర్ వైస్ చైర్మన్ సి.హెచ్. కుటుంబరావు మాట్లాడుతూ విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న విద్యా వనరులను ఉపయోగించుకోవాలన్నారు. ఉమెన్ వరల్డ్ చెస్ ఛాంపియన్ కోనేరు హంపి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు కూడా అవసరమని, శారీరక, మానసిక వికాసానికి దోహదం చేస్తాయన్నారు. సభాధ్యక్షులు కళాశాల చైర్మన్, డాక్టర్ వై.రమేష్ బాబు, మేనేజింగ్ డైరెక్టర్ వై.శారదాదేవి మాట్లాడుతూ గడచిన 10 సంవత్సరాల నుండి కేవలం డేస్కాలర్స్ విద్యా సంస్థగానే, తమ విద్యార్థులు నుండి అత్యుత్తమ ఫలితాలను సాధించి, మంచి మెడికల్ మరియు ఇంజనీరింగ్ కాలేజిలలో సీట్లు సంపాదిస్తూ పదవ వసంతంలోకి అడుగు పెట్టడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ వసంతకాలంలో తాము ఎంతో మంది విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తూ వారికి మంచి భవిష్యత్తును ఇస్తూ విజయపథంలో ముందుకు సాగిపోతున్నామని తెలిపారు. కళాశాల జి.యమ్. జి.వి.రావు తమ కళాశాల వార్షిక నివేదికను సమర్పించారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్ధులకు మెడల్స్‌ను అందజేశారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల సందడి అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …