విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డుంబ్రిగుడ మండలం, కొర్రాయి పంచాయతీ జాముగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రి పాలైన విద్యార్థులు ఆరోగ్యం పై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరా తీసారు.జిల్లాకలెక్టర్ దినేష్ కుమార్ తో ఫోన్ లో పురంధేశ్వరి మాట్లాడుతూ ప్రస్తుతం చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.అరకు కు ఎంతదూరం అనే విషయాలతో పాటు మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా అని కలెక్టర్ ను అడిగారు. ఎందువల్ల అస్వస్థత కు గురయ్యారు అనే విషయం ఆరా తీస్తూ వారికి ఆహారం నాణ్యత పై జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …