అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ వరద బాధితులకు సేవలందించినవారికి మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం సన్మాన కార్య క్రమం జరిగింది. సీఎం నారా చంద్రబాబునాయుడు ఆదేశానుసారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు వీరిని సన్మానించారు. టీమ్ లీడర్లైన
తెలుగు యువత స్టేట్ జనరల్ సెక్రటరి అనిముని రవినాయుడు, మాజీ గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు విఎస్ఎన్ మల్లేశ్వరరావు(మల్లిబాబు), గుంటూరు టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ ప్రెసిడెంట్ మన్నవ వంశీ కృష్ణ, గుంటూరు తెలుగు యువత పార్లమెంట్ ప్రెసిడెంట్ రాయపాటి సాయికృష్ణ, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరి మన్నవ మోహన్ కృష్ణ, శెట్టిబలిజ స్టేట్ సాధికార కమిటీ కన్వీనర్ కురుపూడి సత్తిబాబు, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరి శిశ్లా లోహిత్, తెలుగు యువత పార్లమెంట్ ప్రెసిడెంట్ రెడ్డిసూర్యచంద్ర, తెలుగు యువత స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అక్కల రిశ్వంత్ రాయ్ (రిషి), ఐ టీడీపీ పార్లమెంట్ ప్రెసిడెంట్ కొత్త నరేష్ లను సన్మానించారు. వరద బాధితులకు సహాయ సహకారాలు అందించినందుకు వీరికి పల్లా శ్రీనివాసరావు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము విజయవాడలోని 38, 44 డివిజన్లలో సేవలందించినట్లు తెలిపారు. దాదాపు 500 మంది ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు చెప్పారు. 5 వేల మందికి భోజనాలు, ఆటో నిండా అరటిపళ్లు అందించి తమ సేవా భావాన్ని చాటుకున్నట్లు వివరించారు. ఇంకా ఈ సన్మాన
కార్యక్రమంలో టీఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపాటి అమృతరావు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కుంచకర్ల ధర్మతేజ, జాతీయ కార్యాలయ ఆహ్వాన కమిటి ఛైర్మన్ హాజీ షేక్ హసన్ బాష తదితరులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …