-అన్న క్యాంటీన్ల నిర్వహణ పై సమీక్ష సమావేశం
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో అన్న క్యాంటీన్ల నిర్వహణ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 11 అన్న క్యాంటీన్లకు ప్రతి ఒక్క అన్న క్యాంటీన్ కి ఒక స్పెషల్ ఆఫీసర్గా ఉన్న ఆఫీసర్లతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి అన్న క్యాంటీన్లో ఆహారంలో నాణ్యత, పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా, ఫుడ్ టోకెన్ల వివరాలు, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష సమావేశంలో చర్చించారు. ప్రతి అన్న క్యాంటీన్లో స్పెషల్ ఆఫీసర్ గమనించిన సమస్యలపై వెంటనే తగు చర్యలు తీసుకునేటట్టు ప్రణాళికను సిద్ధం చేసి వెంటనే ఆ సమస్యను పరిష్కరించేలా ఈ సమావేశంలో చర్చించారు. అన్న క్యాంటీన్లో ఏ సమస్య వచ్చినా వెంటనే 15 నిమిషాలలో ఆ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.