Breaking News

స‌ర‌స్వ‌తీదేవిగా నేడు దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం

-బంగారు వీణ‌తో భ‌క్తుల‌కు చ‌దువుల త‌ల్లి సాక్షాత్కారం

ఇంద్ర‌కీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా 7వ రోజైన బుధ‌వారం (ఆశ్వ‌యుజ శుద్ధ స‌ప్త‌మి) నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ శ్రీస‌ర‌స్వ‌తీదేవిగా ద‌ర్శ‌న‌మిస్తుంది. అమ్మ‌వారి జ‌న్మ న‌క్ష‌త్రమైన మూలా న‌క్ష‌త్రానికి శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో ఎంతో విశిష్ట‌త ఉంది. అందుకే ఆశ్వ‌యుజ శుద్ధ స‌ప్త‌మి నాడు చ‌దువుల త‌ల్లిగా కొలువుదీరే దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటెత్తుతారు. త్రిశ‌క్తి స్వ‌రూపిణి నిజ‌స్వ‌రూపాన్ని సాక్షాత్కారింప‌జేస్తూ శ్వేత ప‌ద్మాన్ని అధిష్టించిన దుర్గామాతా తెలుపు రంగు చీర‌లో బంగారు వీణ‌, దండ‌, క‌మండ‌లం ధ‌రించి అభ‌య‌ముద్ర‌తో స‌ర‌స్వ‌తీదేవిగా భ‌క్తుల‌ను అనుగ్ర‌హిస్తుంది. ఈ రోజున అమ్మ‌వారికి గారెలు, పూర్ణాల‌ను నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *