Breaking News

జగన్మాత చెంత కళావైభవం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
మూలా నక్షత్రం రోజైన బుధవారం శ్రీ సరస్వతి దేవి అలంకారంలో జగన్మాత భక్తులకు దర్శనమిచ్చారు. ఇంతటి పుణ్యదినాన అమ్మవారికి భజన సంకీర్తనలు, సంగీతం, నృత్యం, హరికథలతో కళాకారులు పూజించారు. కనకదుర్గ నగర్ లోని కళావేదికపై నాగమణి బృందం, మీనాక్షి శ్రీనివాస్, సింధు బృందం, సాత్విక్ మహదేశ్వర్ ఆలపించిన భజన సంకీర్తనలు భక్తులను సమ్మోహన పరిచాయి. సిహెచ్ అజయ్ కుమార్,సింధూ నాగేశ్వరి బృందం ఆలపించిన సంగీత విభావరి అమ్మవారి భక్తులను పులకింపచేసింది. సిహెచ్ ఆనంద్, ఏం పావని, సంతోష్, భవాని, వి విజయలక్ష్మి, సాయిలిక్షిత, పవిత్ర, ఏ విజయలక్ష్మి, ఎం త్రినాధ చారి, పి మంజుష ప్రదర్శించిన నృత్యాలు అబ్బురపరిచాయి. జి జయరామ సుధాకర్  చెప్పిన హరికథ వీక్షకులను ఆధ్యాత్మిక చింతన కలిగేలా చేసింది. మూలా నక్షత్రం కావడంతో సరస్వతి దేవిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దర్శనం చేసుకున్న అనంతరం కళారూపాలను తిలకించిన భక్తులు పులకించిపోయారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *