Breaking News

మహిషాసుర మర్దని అలంకృత దుర్గమ్మను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ దంపతులు

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు దుర్గమ్మ శ్రీ మహిషాసుర మర్దినిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సతీసమేతంగా దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఈవో రామారావు నీరబ్ కుమార్ ప్రసాద్ దంపతులకు స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం ఆశీర్వచన మండపంలో నీరబ్ కుమార్ ప్రసాద్ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేసారు. అనంతరం ఈఓ రామారావు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం, అమ్మవారి ప్రసాదం అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నగరంలోని వాడుక నీరుని పూర్తిస్థాయిలో శుద్ధి చేసేలా చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని వాడుక నీరుని పూర్తిస్థాయిలో శుద్ధి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *