Breaking News

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. దుష్టశక్తులను పారద్రోలి కొత్త జీవితానికి స్వాగతం పలికే వెలుగుల రోజే దీపావళి పండగ..ఈ దీపావళి రోజున ప్రజలందరి జీవితాల్లో కష్టాల చీకట్లు తొలగిపోయి సంతోషాల వెలుగులు ప్రసరించాలని కోరుకుంటున్నాను. ఓ చిన్న దీపం ఆవిరవుతూ అందరికీ వెలుగు ఇస్తుందన్న ప్రేరణతో అందరం ముందుకు సాగుదాం.. చీకటిని తరిమేసి వెలుగులు నింపే పండుగగా, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని ఘనంగా జరుపుకుందాం.. దీపాల శోభతో  ముంగిళ్లు మురవాలని,  సిరి సందపదలతో నట్టిల్లు వర్థిల్లాలని..అజ్ఞాన చీకట్లను పారద్రోలి మన జీవితంలో వెలుగులు నింపే ఈ దీపావళి అందరికీ శుభం చేకూర్చాలని కోరుకుంటున్నాను. లక్ష్మీ దేవి కృపాకటాక్షాలు మీ ఇంటిపై కురిసి, మీ జీవితంలో ఎప్పుడూ సుఖశాంతులు నిండాలని ఆశిస్తూ  రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *