ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన దేవినేని ఉమా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
బార్ కౌన్సిల్ వేడుకల్లో పాల్గొనేందుకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దేవినేని ఉమా శుభాకాంక్షలు తెలియజేశారు.