–పాఠశాల విద్య సంచాలకులు ఎ. తమీమ్ అన్సారియా, I.A.S.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యావరణ, అటవీ (సైన్స్) శాఖ ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో జరుగుతున్న ‘బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలులో భాగంగా గురువారం ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం’ కార్యక్రమాలు ఘనంగా జరిగాయని పాఠశాల విద్య సంచాలకులు ఎ. తమీమ్ అన్సారియా, I.A.S. గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఐదో రోజు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,033 కార్యక్రమాలు నిర్వహించగా, వీటిలో 5,20,462 మంది విద్యార్థులు మరియు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ రహిత క్యాంపస్, బహుళ వినియోగ బాటిళ్లు/బ్యాగుల వాడకం పెంపొందించడం, ప్లాస్టిక్ సేకరణ వంటివి నిర్వహించారని తెలిపారు. మిషన్ లైఫ్ లక్ష్యాలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ, అవగాహన కార్యక్రమాలు, పౌర భాగస్వామ్యాన్ని పెంపొందించడమే ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
