తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్విమ్స్, శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ ఆధ్వర్యంలో సోమవారం చెంబేడు పిహెచ్ సి పరిధిలోని తాళ్వాయిపాడు సచివాలయం వద్ద ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోంది. ఇందులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. …
Read More »All News
మెగాజాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరన
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా, కలెక్టర్ చేతుల మీదుగా మెగాజాబ్ మేళా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సిడాప్ మరియు డిఆర్డిఏ సంయుక్త ఆధ్వర్యంలో 06- 09-2024 తేదీన అనగా ఈ శుక్రవారం, సత్యవేడు లోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల(Govt Polytechnic College,Sathyavedu)నందు జరగబోయే మెగా జాబ్ మేళా కొరకు ఈరోజు తిరుపతి జిల్లా కలెక్టర్, డాక్టర్.S. వెంకటేశ్వర్ చేతుల మీదుగా పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. …
Read More »జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బాధితులకు భరోసా
పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎలాంటి పరిస్థితి నైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉందని, అధైర్య పడవద్దని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బాధితులకు భరోసా కల్పించారు. జిల్లా కలెక్టర్ సోమవారం జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తో కలిసి పెనమలూరు మండలం పెద్దపులిపాక, యనమలకుదురు కరకట్ట మీద పర్యటించి వరద నీటిలో మునిగిన ప్రాంతాలు, ఇళ్ళు పరిశీలించారు. పెదపులిపాక గ్రామ పరిధిలో నీట మునిగిన ఎన్టీఆర్ కాలనీలో ఇంకా కొంతమంది లోపలే ఉన్నారని తెలుపగా, వారిని పడవల ద్వారా బయటకు …
Read More »అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో వర్షం రాకపోయినప్పటికి, వరద నీరు తగ్గుముఖం పట్టేంతవరకు అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో వరద నీటి ప్రభావంపై సమావేశం నిర్వహించి రేఖ చిత్రపటం గమనిస్తూ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుండి 11.43 లక్షల క్యూసెక్కుల …
Read More »విజయవాడకు 46 మర పడవలు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం రాత్రింబవళ్లు నిద్ర లేకుండా మేల్కొని మచిలీపట్నం నుండి 46 మర పడవలను విజయవాడకు పంపించారు. ఆదివారం రాత్రి జిల్లా కలెక్టర్ మచిలీపట్నం మండలంలోని మంగినపూడి సముద్ర తీరం వద్ద గల తాళ్లపాలెం గ్రామం వైఎస్ఆర్ కాలనీ చేరుకుని అక్కడి మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడ వరద నీటితో జలమయమైనదని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల …
Read More »ఐఏఎస్ ఆఫీసర్, విఎంసి అధికారి, సానిటరీ ఇన్స్పెక్టర్ వార్డ్ సెక్రెటరీలతో స్పెషల్ ఆఫీసర్ల బృందం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజనా సూచనలతో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్లను పెంచుతూ ముందు ప్రాంతాల్లో చెప్పుకున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా, ఇళ్లలోనే ఉండిపోయిన వారిక అందరికీ ఆహారం చేరేలా చర్యలు తీసుకుంటున్న అధికారులు. అందుకు అనుగుణంగా స్పెషల్ ఆఫీసర్ బృందాన్ని పెంచుతూ ప్రతి ఒక్కరికీ ఆహారం చేరేలా వార్డ్ సెక్రెటరీలను స్పెషల్ ఆఫీసర్ల బృందంలో …
Read More »కేంద్ర సహాయంపై ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ వరద పరిస్థితులపై ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్న ప్రధాని కేంద్ర ప్రభుత్వపరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చిన ప్రధాని ప్రస్తుతం జరుగుతున్న వరద సహాయ చర్యలపై ప్రధానికి వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలకు ఆదేశాలు ఇచ్చామని …రాష్ట్రానికి అవసరమైన సహాయం చేయాలని ఆదేశించానని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపిన మోది తక్షణమే ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి అవసరమైన సామాగ్రి …
Read More »బుడమేరు వరద బాధితుల కష్టాలు తీరే వరకు ఇక్కడే ఉంటా
-ప్రజలను కాపాడటం, వారికి భరోసా ఇవ్వడం మా ప్రధాన లక్ష్యం. -1998 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో వర్షాలు పడ్డాయి…విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం -వరద నష్టంపై కేంద్రాన్ని సాయం కోరుతాం. -మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు -నేడు, రేపు విజయవాడ కలెక్టరేట్ లోనే ఉంటానన్న సీఎం…నిద్రహారాలు మానైనా ప్రజల్ని ఆదుకుంటామని హామీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బోటులో వెళ్లి సింగ్‌నగర్, తదితర వరద ప్రాంతాలను చంద్రబాబు …
Read More »50 మంది కాపరులు, 3501 జీవాలను కాపాడిన అధికార యంత్రాంగం
-ప్రాణాల మీదకు తెచ్చిన బ్రతుకుతెరువు -నెలల తరబడి లంకల్లో జీవాలను మేపుకునే కాపరులు -రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లంకలు ముంపుకు గురయ్యే పరిస్థితి -బిక్కుబిక్కుమంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చెరవేత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి, వైకుంఠపురం, గిడుగు, పొందుగల, మునుగోడు. పల్నాడు జిల్లా, అమరావతి మండలంలో కృష్ణా నది ఒడ్డున ఈ గ్రామాల లంకలు పచ్చని బయల్లకు ప్రసిద్ధి. బోట్లలో వందల సంఖ్యలో లంకల్లోకి జీవాలను తోలుకు వెళ్లి నెలల తరబడి అక్కడే నివాసం ఏర్పరుచుకుని జీవనం సాగించే …
Read More »పంట నష్టం అంచనా వేయండి
-పంట నష్టం అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు వేగవంతం చేయండి -డ్రెయిన్ కాలువలు క్లియర్ చేసి నీటి నిల్వలు మళ్లించండి -పశువులు మృత్యువాత పడకుండా అధికారులు, సిబ్బంది మందులతో అందుబాటులో ఉండాలి -వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల కాల్ సెంటర్లు కొనసాగించండి -పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది సెలవులు పెట్టకండి -రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడే పంట …
Read More »