విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజనా సూచనలతో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్లను పెంచుతూ ముందు ప్రాంతాల్లో చెప్పుకున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా, ఇళ్లలోనే ఉండిపోయిన వారిక అందరికీ ఆహారం చేరేలా చర్యలు తీసుకుంటున్న అధికారులు. అందుకు అనుగుణంగా స్పెషల్ ఆఫీసర్ బృందాన్ని పెంచుతూ ప్రతి ఒక్కరికీ ఆహారం చేరేలా వార్డ్ సెక్రెటరీలను స్పెషల్ ఆఫీసర్ల బృందంలో నియమిస్తూ, ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి ఆహార సదుపాయాల్లో లోపం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రతి ప్రాంతానికి సానిటరీ ఇన్స్పెక్టర్, వార్డ్ స్పెషల్ ఆఫీసర్లుగా విజయవాడ నగరపాలక సంస్థ అధికారి, స్పెషల్ ఆఫీసర్ రిలీఫ్ ఆపరేషన్స్ గా ఐఏఎస్ అధికారి, వార్డ్ సెక్రటరీలతో… బృందని ఏర్పాటుచేసి, వరద ముంపు ప్రాంతాల ప్రజలను పునరావస కేంద్రాల్లో తరలించేలా, ఇళ్లలోనే ఉండిపోయిన ప్రతి ఒక్కరికి ఆహారం చేరేటట్టు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Tags vijayawada
Check Also
మచిలీపట్నానికి పూర్వ వైభవం తీసుకురానున్న గోవా షిప్‌యార్డ్
-రూ.8 వేల కోట్ల పెట్టుబడితో 400 ఎకరాల్లో భారీ నౌకా నిర్మాణ పరిశ్రమ -సుమారు 10 వేల మందికి ప్రత్యక్ష …
Prajavartha Online Telugu News