విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సెప్టెంబర్ నెల నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఒకటవ తేదీ ఆదివారం ఉదయం నుండి ప్రారంభించాలని జాయింట్ కలెక్టర్ నిధి మీనా అధికారులను ఆదేశించారు. చౌక ధరల దుకాణ డీలర్లు, ఎండియు ఆపరేటర్లుద్వారా సరుకుల పంపిణీని ప్రతిరోజు ఉదయం 7.గం.లకు నిర్దేసించిన ఎడ్యూల్ ప్రకారం బియ్యం, పంచదార మొదలైన నిత్యావసర సరుకుల పంపిణీకి సిద్ధంగా ఉండాలన్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం నుండి 17వ తేదీ వరకు కార్డుదారులకు ఇంటివద్దనే పంపిణీ చేయాలన్నారు. …
Read More »All News
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై పలు సూచనలు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అధికారులు అందరూ వారి ప్రధాన కార్య స్థానాల్లో అందుబాటులో అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై పలు …
Read More »రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల పట్ల ఎంతో బాధ్యతగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల పట్ల ఎంతో బాధ్యతగా చిత్తశుద్ధితో పనిచేస్తుందని, అర్హులైన పేదలందరికీ పింఛను అందించి ఆదుకోవడమే లక్ష్యమని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారి శాఖ మంత్రివర్యులు కొలు రవీంద్ర అన్నారు. శనివారం ఉదయం మచిలీపట్నం నగరంలోని 20 వ వార్డు గిలకలదిండిలో రాష్ట్ర మంత్రివర్యులు ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఒకవైపున జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ మంత్రివర్యులు పింఛన్లు పంపిణీ చేయడం చెప్పుకోదగ్గ విశేషం. తొలుత మంత్రి గిలకలదిండిలో మంచానికి …
Read More »ప్రధాన ఔట్ఫాల్ డ్రైనలలో పూడికలు తీయండి
-రహదారుల పైన వర్షపు నీరు లేకుండా చర్యలు తీసుకోవాలి -విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం స్పెషల్ చీఫ్ సెక్రటరీ (రెవెన్యూ) సిసోడియా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తో కలిసి సున్నప్పటి సెంటర్ నందు కొండ చర్యలు విరిగిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాదాలకు గురయ్యే అటువంటి ప్రదేశాలను వెంటనే గుర్తించి అధికారులు అకడున్న ప్రజలను అప్రమత్తం చేసి …
Read More »లోతట్టు మరియు కొండ ప్రాంతాలలో నివసించు ప్రజలందరూ సురక్షిత ప్రదేశములకు తరలి రావాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిన్న సాయంత్రం నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమై వున్నందున మరియు రాగల 2 రోజులు భారీ వర్షాలు పడే సూచన ఉన్నందున లోతట్టు మరియు కొండ ప్రాంతాలలో నివసించు ప్రజలందరూ సురక్షిత ప్రదేశములకు తరలి వెళ్ళవలసినదిగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రజలను కోరారు. ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని .ప్రజలు …
Read More »లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్న అధికారులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంతాల్లో, ప్రమాదం పొంచి ఉన్న ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలించారు విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు. 15, 16, 17, 18, డివిజన్ మరియు కొండ ప్రాంత ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వాళ్ళని వెంటనే పునరావస కేంద్రాలకు అధికారులు తరలించి వారికి కావాల్సిన త్రాగునీటి భోజన సదుపాయాలు కల్పించారు. వర్షం నీటిలో చిక్కుకుపోయిన ప్రజలందరూ పునరావస కేంద్రాల్లో …
Read More »తిరుమల శ్రీవారి లడ్డూపై ఆంక్షలు సరికాదు
-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలపై టీటీడీ ఆంక్షలు విధించడం ఎంతమాత్రం సరికాదని విజయవాడ వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఒక భక్తుడికి రెండు మాత్రమే లడ్డూలు ఇచ్చేలా రూల్స్ మార్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ నూతన విధానాలపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం సామర్థ్యం పెంచుకుంటూ పోవాల్సిందిపోయి.. …
Read More »అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆదేశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అల్లూరి జిల్లా డంబ్రిగూడ మండలం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారంతో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు జిల్లా అధికారులతో మాట్లాడారు. అనారోగ్యంతో అరకులోయ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా అధికారులతో మాట్లాడారు. వారిని అప్రమత్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
Read More »తెలుగు భాషోద్యమవేత్త వెంకయ్య నాయుడు
-కలమళ్ల గ్రామాన్ని ఆయన సందర్శించడం మహాభాగ్యం -ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి -తెలుగు భాషా పండితులు, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషకు స్ఫూర్తిదాయకమైన వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుండ్ల మండలం కలమళ్ల గ్రామాన్ని తెలుగు భాషోద్యమవేత్త, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సందర్శించడంతో మహా ప్రాచుర్యంలోకి వచ్చినట్లయిందని తెలుగు భాషా పండితులు, సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు అన్నారు. క్రీ.శ.575లోనే రేనాటి చోళరాజ వంశానికి చెందిన …
Read More »2 అక్టోబర్ 2024 నాటికి ఐదేళ్ల సర్వీస్ పూర్తి అవుతున్నందున అందరికీ సాధారణ బదిలీలకు అవకాశం కల్పించి అత్యంత పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీల విధానం ప్రకారం బదిలీలు కల్పించాలి
-గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అంతర్ జిల్లా బదిలీలు కల్పించి, వ్యవసాయ అనుబంధ విభాగాల ఉద్యోగులకు మరియు ఎ.యన్.యం లకు సైతం బదిలీలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి : ఎం.డి.జాని పాషా రాష్ట్ర అధ్యక్షుడు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అంతర్ జిల్లా బదిలీలు కల్పించాలని,బదిలీల నుండి మినహాయించిన వ్యవసాయ అనుబంధ విభాగాల సచివాలయ ఉద్యోగులైన అగ్రికల్చర్ అసిస్టెంట్లు,హార్టీ కల్చర్ అసిస్టెంట్లు సెరీ కల్చర్ అసిస్టెంట్లు,యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లు,ఫిషరీస్ …
Read More »