Breaking News

All News

చైన్ స్నాచింగ్, బైక్ మరియు లాప్టాప్ లను దొంగిలించు ముగ్గురు నిందితులు అరెస్ట్

-వారి వద్ద నుండి సుమారు 80 గ్రాముల బంగారు ఆభరణాలు, ఐదు లాప్టాప్ లను మరియు ఎనిమిది ద్విచక్ర వాహనాలు కలిపి మొత్తం సుమారు 11 లక్షలు విలువ దొంగ సొత్తు స్వాదీనం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్ జిల్లా నందు జరుగుతున్న దొంగతనాలు మరియు చైన్ స్నాచింగ్ లను నివారించడంలో ప్రత్యేక దృష్టి సారించి నగరంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని పోలిస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., ఆదేశాల మేరకు క్రైమ్ ఏ.డి.సి.పి. కృష్ణ మూర్తి నాయుడు, …

Read More »

లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్కానింగ్ కేంద్రాలలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, దీనిని అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ వారి చాంబర్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ (పిసిపిఎన్డిటి) చట్టంపై జిల్లాస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పదవ అదనపు జిల్లా జడ్జి ఎస్ చినబాబుతో కలసి స్కానింగ్ కేంద్రాల దరఖాస్తుదారుల పత్రాలను పరిశీలించి …

Read More »

ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రజలకు సంతృప్తికరమైన ఆరోగ్య సేవలు అందించాలి అని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఎన్టీఆర్ వైద్య సేవ సంబంధించి 12 డిస్టిక్ డిసిప్లినరీ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని ప్రభుత్వ మరియు నెట్వర్క్ ఆసుపత్రిలోనూ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సంతృప్తి స్థాయిలో సేవలు అందించాలని తెలిపారు. 12 వ …

Read More »

ఎన్టీఆర్ జిల్లాలో 892 అంగ‌న్ వాడీ కేంద్రాల‌కు సొంత భ‌వ‌నాలు నిర్మించాలి

-కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి కి ఎంపి కేశినేని శివ‌నాథ్ విన‌తి ప‌త్రం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో 1457 అంగ‌న్ వాడీ కేంద్రాలు వుండ‌గా వాటిలో 892 అంగ‌న్ వాడీ కేంద్రాలకు సొంత భ‌వ‌నాలు లేవ‌ని అందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి కి విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ లోని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి …

Read More »

వక్ఫ్ సవరణ బిల్లు ను అడ్డుకోవాలి : జమాతే ఇస్లామీ హింద్ సంస్థ‌

-ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎంపి హ‌రీష్ మాధుర్ కు విజ్ఞ‌ప్తి -జాయింట్ పార్ల‌మెంటరీ క‌మిటీ (జెపిసి) పంపాల‌ని కోరిన హ‌రీష్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : వక్ఫ్ సవరణ బిల్లు అమ‌ల్లోకి వ‌స్తే ముస్లిం సమాజానికి క‌ల‌గ‌బోయే ఇబ్బందుల్ని, వక్ఫ్ బోర్డ్ ఆస్తులకు వాటిల్లే నష్టాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతాఉల్లాహ్, జ‌మాతే ఇస్లామి హింద్ సంస్థ బృందం తో క‌లిసి విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్, అమ‌లాపురం ఎంపి హ‌రీష్ మాధుర్ కి కులంకషంగా …

Read More »

ఆదివాసి దినోత్స‌వ వేడుక‌ల ఏర్పాట్లు ప‌ర్య‌వేక్షించిన టిడిపి నాయ‌కులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రంలో శుక్ర‌వారం ఉద‌యం జ‌ర‌గబోయే ప్ర‌పంచ ఆదివాసి దినోత్స‌వ వేడుక‌ల కార్య‌క్ర‌మ ఏర్పాట్లను గిరిజ‌న కార్పొరేష‌న్ మెనేజింగ్ డైరెక్ట‌ర్ బి.న‌వ్య ఐ.ఏ.ఎస్ స‌మ‌క్షంలో గురువారం టిడిపి రాష్ట్ర నాయ‌కులు మాదిగాని గురునాథం, ఎంపి సెక్ర‌ట‌రీ నర‌సింహా చౌద‌రి స‌మీక్షించారు. ఈ వేడుల‌కి ముఖ్యఅతిథిగా సీఎం చంద్ర‌బాబు నాయుడు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఆదివాసీలు హాజ‌రుకానున్న‌ట్లు తెలుగు దేశం నాయ‌కులు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి నాయ‌కులు అబీద్ హుస్సేన్, డాక్ట‌ర్ సంకె విశ్వ‌నాథం, …

Read More »

మాన్యువల్ స్కావెంజేర్ల జిల్లా సర్వేకమిటి ఏర్పాటుకు దరఖాస్తు ఆహ్వానం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మాన్యువల్ స్కావెంజేర్ల జిల్లాసర్వే కమిటి ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ Dr. వెంకటేశ్వర్, I.A.S., ప్రకటన విడుదల చేసారు. మాన్యువల్ స్కావెంజేర్ల జిల్లా సర్వేకమిటి ఏర్పాటుకు మొత్తం నలుగురు సభ్యులు ఉంటారని, వారిలో మాన్యువల్ స్కావెంజేర్స్ లేదా పారిశుద్ద్య కార్మికుల కొరకు పని చేసే స్వచ్చంద సంస్థ (NGOs)ల ప్రతినిధులు ఇద్దరు, మాన్యువల్ స్కావెంజేర్స్ లేదా పారిశుద్ద్య కార్మికుల ప్రతినిధులు ఇద్దరు ఉంటారు వారిలో ఒకరు మహిళా సభ్యులు గా ఉంటారు,ఆసక్తి గలవారు తమ …

Read More »

ఆతిథ్య రంగం అభివృద్ధితో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండు

-ఒబెరాయ్ హోటల్ నిర్మాణ స్థల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ -జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పర్యాటక కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం సమీపంలోని దేవ్ లోక్ నందు ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని పరిశీలించి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి, ఆతిథ్య రంగ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయని దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక పర్యాటక …

Read More »

ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రపంచ ఆదివాసి దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఆదివాసి దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె యన్ జ్యోతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు స్థానిక ఆర్ట్స్ కాలేజ్ నుండి కంబాల చెరువు వరకు ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకల్లో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్థానిక ప్రజాప్రతినిధులు …

Read More »

జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కారం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత వివిధ భీమా సంస్థల ప్రతినిధులు మరియు ఆ సంస్థల న్యాయవాదుల, మోటార్ వాహనాల యాక్సిడెంట్ కక్షిదారుల తరుపు న్యాయవాదుల తో జిల్లా కోర్టు ఆవరణలో గురువారం సమావేశమయ్యారు. సెప్టెంబర్ 14 వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు అధిక మొత్తంలో మోటారు వాహనాల యాక్సిడెంట్ కేసులను పరిష్కరించేందుకు, బాధితులకు తగు పరిహారం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. …

Read More »