Andhra Pradesh

కళాజాతర బృందం ద్వారా అవగాహన కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వారి ఆధ్వర్యంలో మరియు విజయవాడ నగరపాలక సంస్థ నిర్వహణలో ఎర్త్ డే (దరిత్రి దినం) సందర్బంగా బుధవారం ఒన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ వస్త్రాలత జంక్షన్ నందు కళాజాతర బృందం ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏలూరు కు చెందిన యం. ప్రశాంత్ కుమార్ మరియు బృంద కళాజాత్ర కళాకారులు కాలుష్యం మరియు వాటి వల్ల సంభవించు ప్రమాదాలు తదితర అంశాలు వాటి నివారణకు తీసుకొనవలసిన జాగ్రత్తలో ప్రదర్శన ద్వారా …

Read More »

ఎస్టేట్ అధికారులు ప్రత్యేక కలెక్షన్ డ్రైవ్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ వాణిజ్య సముదాయాలలోని దీర్ఘకాలికoగా ఉన్న షాపు లీజుదారుల అద్దె బకాయిలను వసూలు చేయుటలో భాగంగా బుధవారం కాళేశ్వరరావు మార్కెట్ సముదాయంలో ఎస్టేట్ అధికారులు ప్రత్యేక కలెక్షన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ ప్రత్యేక కలెక్షన్ డ్రైవ్ నందు రూ. 4,32,000/- లు బకాయిలు వసూలు చేయుటతో పాటుగా దీర్ఘకాలికoగా అద్దె బకాయిలు కలిగియుండి ఎటువంటి చెల్లింపులు చెల్లించని 9 షాపులను రెవిన్యూ అధికారులు సిజ్ చేసినట్లు ఎస్టేట్ అధికారి తెలియజేసారు. ఈ డ్రైవ్ నందు ఎస్టేట్ …

Read More »

ఫీనిక్స్ పక్షిలా కాంగ్రెస్ బయటకు రావాలి…

-రాహుల్ గాంధీ రాజ్యం కోసం రక్తం ధార పోస్తాం -ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ విస్ఫోటనం జరగాలి -ఈ పార్టీలను వేటాడుతాం..వెంటాడుతాం.. -అభివృద్ధికి అడ్డు వచ్చిన వారిని నిద్ర పోనివ్వం -నాయకత్వం అంతా కార్యకర్తలదే -కష్టాల్లో… నష్టాల్లో తోడుందేది మీరే -రాష్ట్రంలోని నలు మూలలనుంచి ముట్టడించబోతున్నాం -మనమంతా రాహుల్ గాంధీ సైనికులం -ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సమ్మేళనంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాహుల్ గాంధీ రాజ్యం కోసం రక్తం ధార …

Read More »

బాటసారుల దాహార్తి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మండుతున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పాదచారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఏలూరు రోడ్డులో ఫర్నీచర్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ఎండలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో పాదచారులు, నగర ప్రజలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారుల దాహం తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వీటి ఏర్పాటుకు ముందుకొచ్చిన …

Read More »

ఎండాకాలంలో అగ్ని ప్రమాదాల పట్ల అత్యంత జాగ్రత్త అవసరం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎండాకాలంలో అగ్ని ప్రమాదాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. వాంబే కాలనీలోని రైల్వే ఖాళీ స్థలంలో అగ్ని ప్రమాదం సంభవించిన ప్రాంతాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను స్థానిక నాయకులను అడిగి తెలుసుకున్నారు. సమాచారం తెలియజేసిన వెంటనే అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రమాద తీవ్రతను తగ్గించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి ఈ సందర్భంగా స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట 60వ డివిజన్ వైసీపీ …

Read More »

శ్రీలంకను మించి దారుణంగా కుప్పకూలిన తెలుగుదేశం పార్టీ…

-వాలంటీర్లకు సేవా పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి శ్రీలంకను మించి దారుణంగా కుప్పకూలిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు విమర్శించారు. అజిత్ సింగ్ నగర్లోని షాదీ ఖానా కల్యాణ మండపం నందు 58, 59, 60 డివిజన్ల వాలంటీర్లకు నిర్వహించిన సేవా పురస్కారాల ప్రదానోత్సవ వేడుకలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ రెడ్డి, వైసీపీ కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

Read More »

అధికారం లేకపోతే తెలుగుదేశం పార్టీ బ్రతకలేని పరిస్థితి…

-క్లీన్ ఆంధ్రప్రదేశ్(క్లాప్) కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారం లేకపోతే తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా బ్రతకలేకుండా ఉన్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మితో కలిసి 62వ డివిజన్ పటేల్ నగర్ లో ఇంటింటికీ చెత్త సేకరణ డబ్బాలను పంపిణీ చేశారు. గార్భేజ్ ఫ్రీ నగరంగా విజయవాడను తీర్చిదిద్దడమే తమ ప్రధాన కర్తవ్యమని ఈ సందర్భంగా వెల్లడించారు. వాతావరణానికి, ప్రజలకు హానికరమైన వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ …

Read More »

ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు నాయుడు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయానికి తరలి వచ్చిన కార్యకర్తలు, నేతలు అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం చంద్రబాబు నివాసంవద్ద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చంద్రబాబు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి నేతలతో కలిసి వెళ్లారు. దుర్గగుడి వద్ద ఆలయ ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు.అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ …

Read More »

బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాల తనిఖీ నిర్వహించిన ఆర్టీసీ ఎండి సి.హెచ్‌.ద్వారకా తిరుమలరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయి పర్యటనల కోసం ప్రత్యేకంగా కేటాయించబడ్డ 2-బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులను, 1-ప్యాంట్రీ వాహనాన్ని ఆర్టీసీ ఎండి సి.హెచ్‌.ద్వారకా తిరుమలరావు, ఐ.పి.ఎస్‌. విజయవాడ డిపోలో స్వయంగా తనిఖీచేసి, వాహనాల కండీషన్‌ను పరిశీలించి సంతృప్తివ్యక్తంచేసారు. వాటి నిర్వహణపట్ల అధికారులు తీసుకుంటున్న రోజువారీ జాగ్రత్తలు, ట్రయల్‌ రన్‌, పరిశుబ్రత పనితీరు, తదితర విషయాలను అడిగి తెలుసుకుని వారిని అభినందించారు. ముఖ్యమంత్రి రాష్ట్ర పర్యటనల కోసం, ఏపీఎస్‌ఆర్టీసీ 2009, 2015 సంవత్సరములలో రెండు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను మరియు ఒక …

Read More »

టీడీపీ కృష్ణాజిల్లా కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  72 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొల్లపూడి నాగేశ్వరరావు రాష్ట్ర బీసీ నాయకులు లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ లు కేక్ కట్ చేసి స్వీట్లు కార్యకర్తలకు పంచి పెట్టారు. గొల్లపూడి నాగేశ్వరరావు, లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ మా నాయకుడు చంద్రబాబు కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను …

Read More »