విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయి పర్యటనల కోసం ప్రత్యేకంగా కేటాయించబడ్డ 2-బుల్లెట్ ప్రూఫ్ బస్సులను, 1-ప్యాంట్రీ వాహనాన్ని ఆర్టీసీ ఎండి సి.హెచ్.ద్వారకా తిరుమలరావు, ఐ.పి.ఎస్. విజయవాడ డిపోలో స్వయంగా తనిఖీచేసి, వాహనాల కండీషన్‌ను పరిశీలించి సంతృప్తివ్యక్తంచేసారు. వాటి నిర్వహణపట్ల అధికారులు తీసుకుంటున్న రోజువారీ జాగ్రత్తలు, ట్రయల్ రన్, పరిశుబ్రత పనితీరు, తదితర విషయాలను అడిగి తెలుసుకుని వారిని అభినందించారు. ముఖ్యమంత్రి రాష్ట్ర పర్యటనల కోసం, ఏపీఎస్ఆర్టీసీ 2009, 2015 సంవత్సరములలో రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను మరియు ఒక ప్యాంట్రీ కారును కొనుగోలు చేయడం జరిగింది. ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వివిఐపి పర్యటనలకు అనుకూలంగా ఎన్నో ప్రత్యేకతలను కలిగివున్నాయి. అయితే, ముఖ్యమంత్రి వై .ఎస్. జగన్మోహనరెడ్డి ఇంతవరకూ ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వినియోగించుకోలేదు. అయినప్పటికినీ, ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి వివిధ జిల్లాలను తరచూ సందర్శిస్తున్న సందర్బాలలో ఈ వాహన అవసరం ఉండవచ్చునన్న ఉద్దేశ్యంతో ఆర్టీసీ ఎండి సి.హెచ్.ద్వారకా తిరుమలరావు, ఐ.పి.ఎస్. విజయవాడ డిపోలో ఉన్న 2-బుల్లెట్ ప్రూఫ్ మరియూ ప్యాంట్రీ వాహనాలను తనిఖీ చేయడం జరిగింది. ఈ వాహనాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని, సంబంధిత ఆర్టీసీ అధికారులు, సూపర్వైజర్లకూ కొన్ని నిర్దిష్ట సూచనలు చేసారు.
Prajavartha Online Telugu News