విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లోని కార్యాలయాలు, నివాసాల వద్ద అనవసరమైన లైట్లను ఆర్పివేయడం ద్వారా ‘ఎర్త్ అవర్’ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించగల పరిరక్షణ, స్థిరమైన పద్ధతులను దృష్టిలో ఉంచుకోవడానికి ‘ఎర్త్ అవర్’ ప్రచారం దోహదపడుతుందని గవర్నర్ అన్నారు. ‘ఎర్త్ అవర్’ ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి 8.30 గంటల నుండి 9.30 వరకు విజయవాడ రాజ్‌భవన్ ఆవరణలో అన్ని అనవసర లైట్లను ఆర్పివేస్తామని గవర్నర్ ప్రత్యేక ప్రధాన …
Read More »Andhra Pradesh
జలశక్తి అభియాన్ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేబినెట్ కార్యదర్శి వీడియో సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సూచించారు.జలశక్తి అభియాన్ కార్యక్రమంపై శుక్రవారం ఆయన ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గౌబ మాట్లాడుతూ 2019 లో ప్రధాన మంత్రి నరేంద్ర మోది జలశక్తి అభియాన్ మొదటి దశ కార్యక్రమాన్ని ప్రారంభిచగా తొలుత దేశంలో నీటి ఒత్తిడిని …
Read More »ఆరోగ్యకరమైన సమాజం కోసమే పర్యావరణ చట్టాలు
-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ -భారతదేశంలో పర్యావరణ చట్టం-ఒక పునఃపరిశీలన అనే అంశంపై మేధావుల సదస్సు -పర్యావరణ చట్టాల ఆవశ్యకతను ఉటంకించిన పలువురు న్యాయమూర్తులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ, నియంత్రణ ప్రభుత్వాలు తమ పౌరులకు అందించే ప్రజా సేవల్లో కీలకమైనవని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పర్యావరణ చట్టాలు కాలుష్యానికి కారణమయ్యే వ్యర్థ పదార్థాలను బాధ్యతాయుతంగా నిర్మూలించేలా చూస్తాయన్నారు. భారత మేధావుల సదస్సు (ఐసీఓఐ) ఆధ్వర్యంలో శుక్రవారం గేట్‌వే హోటల్‌లో “భారతదేశంలో పర్యావరణ చట్టం-ఒక …
Read More »జిల్లాలో 131 హాస్టళ్లను ‘మార్పు’ ద్వారా అభివృద్ధి: జిల్లా కలెక్టర్ జె.నివాస్
-విద్య అభ్యసించి పరిసరాలు సౌకర్యవంతంగా ఉంటే ఉత్తమ ఫలితాలు -‘మార్పు’ తో సంక్షేమ హాస్టళ్లకు మహర్దశ: -గన్నవరం మండలం దావాజిగూడెంలో సంక్షేమ హాస్టల్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యనభ్యసించే ప్రదేశం ఆహ్లాదకరంగా, సౌకర్యవంతంగా ఉంటే మరింత ఏకాగ్రతతో విద్య అభ్యసించి అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. గన్నవరం మండలం దావాజీగూడెంలోని సాంఘీక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని, బీసీ బాలికల వసతి గృహాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ‘మార్పు’ కార్యక్రమం …
Read More »వంటనూనెలను ఎమ్మార్పీకన్నా అధిక ధరలకే విక్రయిస్తే చర్యలు…
-జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక తనిఖీలు… -రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యావసర సరుకులను, ముఖ్యంగా వంట నూనెలను నిర్దేశిత ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మినా, పరిమితికి మించి నిల్వచేసినా బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజయవాడ యూనిట్ …
Read More »ప్రజల మదిలో శాశ్వతంగా నిలిచేలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ పండరిపురం నందు గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా అవినాష్ ఇంటి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు గురుంచి,ఈ డివిజన్ …
Read More »“ఎగుమతుల పనితీరు”లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానం : పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్
-గుజరాత్ తర్వాత స్థానంలో నిలిచి సత్తా చాటిన ఏపీ -పరిశ్రమల శాఖను ప్రశంసించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ -ఎగుమతుల పెంపే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం వినూత్న చర్యలు -“ఎగుమతుల సంసిద్ధత సూచీ”లో 20వ స్థానం నుంచి 9వ స్థానానికి ఎగబాకిన ఆంధ్రప్రదేశ్ -ఎగుమతుల వాతావరణంలో 10వ స్థానం, వాణిజ్య వాతావరణంలో 8వ స్థానం -2021కి గానూ “ఎగుమతుల సంసిద్ధత సూచీ”ని విడుదల చేసిన నీతి ఆయోగ్ -పాలసీ, వాణిజ్య వాతావరణం, ఎగుమతుల సానుకూలత, ఎగుమతుల పనితీరు వంటి నాలుగు కీలక విభాగాల్లో మెరుగైన ర్యాంక్ …
Read More »విద్యార్ధిని ఆత్మహత్య ఘటనపై ‘మహిళా కమిషన్’ సీరియస్
– బ్రహ్మర్షి ప్రిన్సిపాల్ పై చర్యలకు ఆదేశం – నివేదిక కోరుతూ చిత్తూరు కలెక్టర్ కు లేఖ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన పదో తరగతి విద్యార్ధిని ఆత్మహత్య ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ గా స్పందించింది. కేసును సుమోటోగా స్వీకరించింది. కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ శుక్రవారం చిత్తూరు ఎస్పీతో మాట్లాడారు. ఘటన పూర్వాపరాలను ఆరాతీశారు. మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీసు అధికారులతో మాట్లాడారు. ఆమె …
Read More »రాజ్యాంగబద్ధమైన కోర్టు తీర్పులపై బురదజల్లే విధానాన్ని ఏపీసీసీ లీగల్ తీవ్రంగా ఖండిస్తుంది… : ఏపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ వి.గురునాధం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మూడు రాజధానుల తీర్పుపై వైసిపి నాయకులు ఎవరికి వారు తీర్పును వక్రీకరించి ప్రజలలో అపోహలు అపనమ్మకాన్ని కల్పించే విధంగా బురదజల్లే కార్యక్రమం చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్టేట్ లీగల్ సెల్ చైర్మన్ వి గురునాధం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైకోర్టు 3 రాజధానులు పై త్రిసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పుపై నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చలో హైకోర్టు తన పరిధి దాటుతుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటించడం కోర్టు ధిక్కారమేనన్నారు. శాసనసభ చట్టాలు …
Read More »63 లక్షల ప్యాకేజీతో అంతర్జాతీయ ఉద్యోగంసాధించిన విఐటి -ఏపి విద్యార్థి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విఐటి -ఏపి విశ్వవిద్యాలయానికి చెందిన సుధాన్షు దొడ్డి అనే బి.టెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) విద్యార్థి 63 లక్షల ప్యాకేజీతో అమెరికాకు చెందిన ప్రముఖ అనలిటిక్స్ కంపెనీలో ఉద్యోగాన్ని సాధించాడు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా|| ఎస్.వి. కోట రెడ్డి మాట్లాడుతూ విఐటి -ఏపి అవలంబించే అత్యుత్తమ విద్యా విధానాలు, విద్యార్థుల అకుంఠిత దీక్షవల్లే ఇటువంటి అనితర సాధ్యమైన విజయలను సాధించగలుగుతున్నామని అన్నారు. ప్రపంచానికి బాధ్యతగల రేపటితరం నాయకులను అందించటానికి విఐటి -ఏపి నిరంతరం కృషి …
Read More »