అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ, పేదలకు ఇళ్ల నిర్మాణంపై గురువారం శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ… ఇదో గొప్ప కార్యక్రమం… ఇళ్ల స్ధలాల పంపిణీ, పేదలకు ఇళ్ల నిర్మాణాలపై ఈరోజు జరుగుతున్న చర్చా కార్యక్రమంలో చాలామంది శాససనభ్యులు అందరూ చక్కగా మాట్లాడారు. మంత్రి రంగనాథరాజుగారు కూడా సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. ప్రతి శాసనసభ్యుడు కూడా సగర్వంగా ఏ నియోజకవర్గంలో అయినా వెళ్లి తిరుగుతూ.. నేను ఫలానా పని చేశాను అని సగర్వంగా చెప్పుకునే గొప్ప కార్యక్రమం …
Read More »Andhra Pradesh
తెలుగుటైమ్స్ మొబైల్ యాప్‌ను ప్రారంభించిన సజ్జల రామకృష్ణారెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమెరికాలో గత 19 సంవత్సరాలుగా తెలుగు కమ్యూనిటీకి మీడియాపరంగా సేవలందిస్తున్న ‘తెలుగుటైమ్స్’ పత్రిక మొబైల్ యాప్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలోని ఎన్నారైలకు మీడియా వాహనంగా, ఎన్నారైలు మరియు తెలుగు రాష్ట్రాల మధ్య మీడియా వారధిగా సేవలందిస్తున్న తెలుగు టైమ్స్ 19వ వార్షిక శుభవేళలో తన మొబైల్ యాప్‌ను తీసుకువచ్చినందుకు శుభాభినందనలు అన్నారు. ‘ఈ రోజుల్లో అందరూ మొబైల్ ఫోన్‌లలో మాత్రమే వార్తలు మరియు …
Read More »తెలుగు రాష్ట్రాలో భగభగమంటున్నభానుడు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెండు తెలుగు రాష్ట్రాలో భానుడు భగభగమంటున్నాడు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉష్ణోగ్రతలు ఇప్పటికే సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అలర్ట్ చేసింది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న ప్రాంతాల వివరాలను తెలిపింది. ఈ వివరాల ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 670 మండలాలకు గాను బుధవారం మూడు …
Read More »కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిజిటల్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్, డాబా కోట్లు రోడ్డు, గంగానమ్మ గుడి సెంటర్ వద్ద గురువారం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ ఆధ్వర్యంలోకాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్ (పార్టీ సభ్యత్వ నమోదు) కార్యక్రమం జరిగింది. ఈ డిజిటల్ మెంబర్షిప్ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలోని ప్రతి గడపకు కాంగ్రెస్ పార్టీ చేరుకోవాలని అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసిన …
Read More »అమాత్యుల రాకతో చేనేత ప్రదర్శనలో సందడి
-అందుబాటు ధరలలో నూతన వస్త్ర శ్రేణి లభిస్తుందన్న శాసన సభ్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ చేనేత ప్రదర్శనలో అమాత్యులు, మహిళా శాసన సభ్యులు సందడి చేసారు. గత రెండు వారాలుగా విజయవాడ నగర వాసులకు దేశంలోని విభిన్న రాష్ట్రాల చేనేత వస్త్రాలను పరిచయం చేస్తున్న ఈ ప్రదర్శన శుక్రవారంతో ముగియనుంది. గురువారం నాటి శాసన సభ సమావేశాల అనంతరం నగరంలోని ఎ ప్లస్ కన్వెన్షన్ లో జరుగుతున్న ప్రదర్శనకు వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పుష్ప శ్రీవాణి, …
Read More »రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రూ. 2,205 కోట్లతో రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టాం…
-నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆర్ అండ్ బి రోడ్లలో మార్పు తీసుకువచ్చాం.. -10 సంవత్సరాలుగా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన కారణంగానే నేడు ఆర్ అండ్ బి రోడ్లు దుస్థితి.. -రాష్ట్రంలో చేపట్టిన ఆర్ అండ్ బి రోడ్ల మరమ్మత్తు పనులన్నీ జూన్ నెలాఖరు నాటికీ పూర్తి చేస్తాం.. -రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి ఎమ్. శంకరనారాయణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 8 వేల 268 కిలో మీటర్ల మేర రహదారులను రూ. 2205 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని …
Read More »కోవిడ్ వ్యాధి నివారణలో ఫ్రంట్‌లైన్ వారియర్స్ అలుపెరగని పోరాటం చేస్తున్నారు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ నివారణకు స్వచ్ఛంద సంస్థలు ముందకు రావడం అభినందనీయమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.యం సుహాసిని అన్నారు. ఫైజర్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని డాక్టర్స్‌ఫర్ యు స్వచ్ఛంద సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్ఫాన్స్‌భుల్టీలో భాగంగా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు రూ. 5 లక్షల విలువైన ఎన్`95 మాస్క్, శానిటైజర్లను సంస్థ ప్రతినిధులు గురువారం క్యాంప్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా.యం సుహాసినికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ వ్యాధి నివారణలో ఫ్రంట్‌లైన్ వారియర్స్ …
Read More »పాస్టర్లకు గౌరవ వేతనానికి ఈనెల 21 తేదీ లోపు ధరఖాస్తు చేసుకోండి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అర్హతగల పాస్టర్లకు నెలకు రూ. 5000/` గౌరవవేతనం పొందేందుకు వీలుగా ధరఖాస్తులు స్వీకరించటం జరుగుతుందని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిని యండి రియాజ్ సుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు అర్హత గల పాస్టర్లకు గౌరవ వేతనం తీసుకునేందుకు సంబంధిత ధరఖాస్తులను ఈనెల 21వ తేదీ లోపు సమర్పించాలని ఆమె కోరారు. చర్చికి సంబంసధించిన భూమి చర్చి పేరుపై నమోదై వుండాలని, తహాశీల్థార్ జారీ చేసిన స్వాధీన దృవీకరణ పత్రం, దాతలు …
Read More »విద్యార్థులకు అవసరమైన ఉపకరణాలను సమగ్ర శిక్ష ద్వారా అందించడం జరుగుతుంది…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు అవసరమైన ఉపకరణాలు అందించడంలో ముందుకు వస్తున్న స్వచ్ఛంద సేవ సంస్థలను జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) కె.మోహన్‌కుమార్ అభినందించారు. జిల్లాలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మదర్‌తెరిసా చారిటబుల్ సాసైటి తాడేపల్లి గూడెం స్వచ్ఛంద సంస్థ సహకారంతో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిర్థారణ శిభిరం నందు గుర్తించిన 33 మంది ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు కాలిపర్స్‌వాకర్స్‌ను జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మోహన్‌కుమార్ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. స్థానిక గుణదలలోని సెయింట్ ఆలోషియన్ హోమ్ …
Read More »జిల్లాలో భూముల రీసర్వే వేగవంతంగా నిర్వహిస్తున్నాం… : కలెక్టర్ జె.నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో భూముల రీసర్వే వేగవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్‌కు వివరించారు. గొల్లపూడిలోని సిసిఎల్‌ఏ కార్యాలయం నుండి గురువారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో దశల వారిగా జరుగుతున్న రీ సర్వే పై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ సమీక్షించారు. నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి గురువారం కలెక్టర్ …
Read More »