Andhra Pradesh

దామోదరం సంజీవయ్య సేవలు ఆదర్శప్రాయం…

-ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దామోదరం సంజీవయ్య శత జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు ఆలీ ఖాన్ మరియు కిర్నూల్ జిల్లా నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో దళిత బడుగు బలహీన వర్గాలకు దామోదరం సంజీవయ్య చేసిన సేవలను కొనియాడారు. సోమవారం …

Read More »

విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో దామోదరం సంజీవయ్యకు ఘన నివాళులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు స్వర్గీయ దామోదరం సంజీవయ్య శత జయంతి సందర్భంగా ఏపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ కొరివి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో దామోదరం సంజీవయ్య కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో దళిత బడుగు బలహీన వర్గాలకు దామోదరం సంజీవయ్య చేసిన …

Read More »

సఫాయి కర్మ చారిలకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనములు, అమలు చేస్తున్న పథకములు చేరువ చేయాలి…

-జాతీయ సఫాయికర్మచారి కమిషన్ సభ్యులు డా. పి.పి.వవ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ సఫాయికర్మచారి కమిషన్ మెంబర్ డా.పి.పి.వవ విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు జిల్లా పరిధిలో గల మునిసిపల్ కమిషనర్లు మరియు వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ శ్రీ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్, జాయింట్ కలెక్టర్ (ఆసరా) శ్రీ మోహనరావు, డిప్యూటీ మేయర్లు శ్రీమతి బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజ తదితరులు పాల్గొన్నారు. జాతీయ సఫాయికర్మచారి …

Read More »

అర్జీదారుల సంతృప్తే లక్ష్యం…

-ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మరియు కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీదారుల సమస్యలను కూలంకషంగా పరిశీలించి, నాణ్యమైన పరిష్కారం చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.రంజిత్ భాషా, మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమములో మేయర్ మరియు కమిషనర్ ప్రజల నుండి సమస్యల అర్జీలు స్వీకరించారు. ప్రధాన కార్యాలయంతో పాటుగా జోనల్ కార్యాలయాలలో నిర్వహించిన …

Read More »

హిజాబ్ ధరించడం ముస్లిం మహిళల సాంప్రదాయo…

-హిజాబ్ ధరించడం ముస్లిం మహిళలకు చాలా గౌరవమo -రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు వారి యొక్క మతాలను గౌరవించుకునటువంటి స్వేచ్ఛ ఉంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హిజాబ్ కు మద్దతుగా షేక్ మోబినా మరియు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో వించిపేట గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నుండి పంజా సెంటర్ వరకు వందలాది మంది ముస్లిం మహిళల తో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు పెద్దఎత్తున హిజాబ్ మా సాంప్రదాయ వస్త్రధారణ అని,జీవితాంతం హిజాబ్ ధరిస్తామని పెద్దఎత్తున నినదించారు. …

Read More »

సంజీవయ్య నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య  101 వ జయంతి వేడుకలను జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ సంజీవయ్య  నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమని, ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించిన గొప్ప వ్యక్తిని, ఆరు లక్షల ఎకరాల బంజరు భూములను పేద ప్రజలకు …

Read More »

ఘనంగా పెజ్జోన్‌పేటలో దామోదరం సంజీవయ్య 101వ జయంతి కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గ పెజ్జోన్‌పేటలో మాజీ ముఖ్యమంత్రి, దామోదరం సంజీవయ్య విగ్రహం వద్ద సంజీవయ్య 101వ జయంతి కార్యక్రమం మెడబలిమీ దైర్యానందం అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో 35వ డివిజన్‌ కార్పొరేటర్‌ బాలసాని మణమ్మ ముఖ్యఅతిధిగా పాల్గోని కేక్ కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో ఉన్న పెద్దపాడులో ఒక దళిత కుటుంబములో మునెయ్య, సుంకులమ్మ దంపతులకు ఫిబ్రవరి 14,1921 సంజీవయ్య జన్మించారని, 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే …

Read More »

గత ప్రభుత్వ హయాంలో వక్ఫ్ బోర్డు లో జరిగిన అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలి… : సయ్యద్ నూరుద్దీన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రామవరప్పాడు లో ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలకు నిలయంగా మారిన వక్ఫ్ బోర్డు లోని కొంతమంది అధికారాన్ని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలకు సంబంధించిన వక్ఫ్ ఆస్తులను  లాంగ్ లీజుల పేరుతో వక్ఫ్ భూములను భారీ ఎత్తున అమ్మేసి …

Read More »

అంగరంగ వైభవంగా16 నుంచి పెనుగంచిప్రోలు తిరుపతమ్మవారి కల్యాణోత్సవాలు…

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి భక్తుల పాలిట కొంగు బంగారమైన పెనుగంచి ప్రోలు తిరుపతమ్మవారి కల్యాణ మహోత్సవాలు ( పెద్ద తిరునాళ్ల ) ఫిబ్రవరి 16 నుంచి 20 వ తేదీ వరకు జరగనున్నాయి. గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కల్యాణంతో పాటు 41 రోజుల శ్రీగోపయ్య సమేత తిరుపతమ్మవారు పాటు మండల దీక్ష చేపట్టిన వేలాది మంది స్వాములు తిరుముడి సమర్పించి దీక్ష విరమించేం దుకు తగిన ఏర్పాటు ఆలయ అధికారులు చేస్తున్నారు. రెండు తెలుగు …

Read More »

నేడు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఏడుగురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేలపాడులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో 14వ తేది సోమవారం ఉదయం 10‌‌:30 గం.లకు ఇటీవల రాష్ట్ర హైకోర్టుకు న్యాయమూర్తులుగా నియమింపబడిన ఏడుగురు న్యాయమూర్తులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణం చేయించనున్నారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో జరిగే ఈకార్యక్రమంలో నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ కొనకంటి శ్రీనివాస్ రెడ్డి, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్,జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ,జస్టిస్ తర్లడ రాజశేఖర్ రావు,జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి,జస్టిస్ రవి చీమలపాటి,జస్టిస్ వడ్డిబోయన సుజాత లచే …

Read More »