పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త :
కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి భక్తుల పాలిట కొంగు బంగారమైన పెనుగంచి ప్రోలు తిరుపతమ్మవారి కల్యాణ మహోత్సవాలు ( పెద్ద తిరునాళ్ల ) ఫిబ్రవరి 16 నుంచి 20 వ తేదీ వరకు జరగనున్నాయి. గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కల్యాణంతో పాటు 41 రోజుల శ్రీగోపయ్య సమేత తిరుపతమ్మవారు పాటు మండల దీక్ష చేపట్టిన వేలాది మంది స్వాములు తిరుముడి సమర్పించి దీక్ష విరమించేం దుకు తగిన ఏర్పాటు ఆలయ అధికారులు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అమ్మవారి కల్యాణానికి తరలివచ్చే అవకాశం ఉంది.
తిరుపతమ్మ ఆలయ స్థల పురాణం…
17 వ శతాబ్దంలో పవిత్ర మునేటి తీరాన కొల్లా శివ రామయ్య, రంగమాంబ దంపతులకు ఏడుకొండలవాడి వర ప్రసాదంగా తిరుపతమ్మ జన్మిస్తుంది . పెనుగంచిప్రోలులోని కాకాని కృష్ణయ్య, వెంగమాంబ దంపతుల కుమారుడు గోపయ్యను వివాహం చేసుకున్న తిరుపతమ్మ రాకతో ఆ ప్రాంతమంతా సుభిక్షంగా వర్ధిల్లుతుంటుంది. అయితే అనుకోకుండా ఒకనాడు ఎండలు పెరిగి .. పాడిపంటలు కరువై .. కరువు విలయ తాండవం చేస్తుంది. దీంతో పశుఁగాసం కోసం గోపయ్య గోవులను తోలుకొని అడవికి వెళ్తాడు. ఈసమయంలో అత్త, తోటికోడలు ఆరళ్లకు తోడు భయంకరమైన కుష్ఠు వ్యాధితో బాధ పడుతున్న తిరుపతమ్మను పశువుల పాకకు గెంటి వేస్తారు. పశువుల శాలలో దీన స్థితిలో ఉన్న ఆమెకు పాపమాంబ అనే ముదిరాజ్ కులానికి చెందిన సేవకురాలు సేవలందిస్తుంది . అడవికి వెళ్లిన గోపయ్య పులి దాడిలో మరణించాడని తెలుసుకున్న తిరుపతమ్మ తన అవతార సమాప్తిని గ్రహించి గ్రామాధి కారులు, ప్రజలకు తన మహిమలను తెలుపుతుం ది. భర్తతో పాటు సహగమనం చేస్తుంది. ఆతరువాత కాలంలో అదే ప్రాంతంలో గోపయ్య సమేత తిరుపతమ్మ విగ్రహాలతో పాటు, కుంకుమ భరిణ దొరికాయని, ఆప్రాంతంలోనే ఆలయం నిర్మించారని భక్తులు చెబుతారు. ప్రతిఏటా మాఘశుద్ధ పౌర్ణమి, పాల్గుణ పౌర్ణమికి రెండు సార్లు ఐదు రోజులపాటు తిరునాళ్ల నిర్వహిస్తారు. కుష్ఠు రోగిగా ఉన్న తిరుపతమ్మకు సేవలు చేసిన పాపమాంబ, వంశీయులే నేటికీ అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని సేవించి తరిస్తున్నారు .
క్షేత్రం చేరుకోవటానికి మార్గాలు …
పెనుగంచిప్రోలు పుణ్యక్షేత్రం చేరుకోవటానికి విజ యవాడ నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి . పెనుగంచిప్రోలు నుంచి విజయవాడకు 60 కిలో మీటర్ల దూరం ఉంది. అలాగే పెనుగం చిప్రోలుకు 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న జగ్గ య్యపేట నందిగామ నుంచి కూడా ఆర్టీసీ బస్సులు , ఆటోలు ఉన్నాయి. ఖమ్మం, మధిర నుం చి బస్సులు అందుబాటులో ఉన్నాయి.
Prajavartha Online Telugu News