Breaking News

Tag Archives: penuganchiprolu

తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు గ్రామంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ గోపయ్య సమంత శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈరోజు శాకంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు, ఆషాడ మాసం ఆదివారం సందర్భంగా అమ్మవారి మూలవిరాటు మరియు పరివార దేవతలకు దాతల సహకారంతో వివిధ రకాల కూరగాయలు,పండ్లతోటి అలంకరణ చేశారు. సాయంత్రం వరకు భక్తులకు అమ్మవారి శాకంబరీ దర్శనం కల్పిస్తామని డిప్యూటీ కలెక్టర్ & కార్యనిర్వహణాధికారి కె. రమేష్ నాయుడు తెలియజేశారు.

Read More »

వైభవంగా శ్రీ తిరుపతమ్మ తల్లి శాఖాంబరీ అలంకారం ఏర్పాట్లు…

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం, నందు ఆదివారం శ్రీ అమ్మవారి కి మరియు పరివార దేవతలు శాకాంబరీ అలంకరణ లో భక్తులకు దర్శనము ఇవ్వనున్నారు. అందులో భాగంగా శనివారం గ్రామస్థులు మరియు సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కావున భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నారు.

Read More »

అంగరంగ వైభవంగా16 నుంచి పెనుగంచిప్రోలు తిరుపతమ్మవారి కల్యాణోత్సవాలు…

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి భక్తుల పాలిట కొంగు బంగారమైన పెనుగంచి ప్రోలు తిరుపతమ్మవారి కల్యాణ మహోత్సవాలు ( పెద్ద తిరునాళ్ల ) ఫిబ్రవరి 16 నుంచి 20 వ తేదీ వరకు జరగనున్నాయి. గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కల్యాణంతో పాటు 41 రోజుల శ్రీగోపయ్య సమేత తిరుపతమ్మవారు పాటు మండల దీక్ష చేపట్టిన వేలాది మంది స్వాములు తిరుముడి సమర్పించి దీక్ష విరమించేం దుకు తగిన ఏర్పాటు ఆలయ అధికారులు చేస్తున్నారు. రెండు తెలుగు …

Read More »

పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి రంగుల మహోత్సవం…

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి రంగుల మహోత్సవం సందర్భంగా గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి మరియు సహ దేవతల ఉత్సవ విగ్రహాలను పెనుగంచిప్రోలు ప్రధాన వీధుల గుండా అమ్మవారి మండపం వరకు భక్తుల కోలా హలంతో ఊరేగింపు గా తీసుకెళ్ళుతున్న దృశ్యాలు.ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ ఇంజం చెన్న కేశవరావు,పాలక మండలి మరియు దేవస్థాన సిబ్బంది, పోలీస్, రెవెన్యూ, పంచాయితీ,అగ్నిమాపకం,ఆరోగ్య శాఖ మరియు గ్రామ ప్రజలు, భక్తులు, కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Read More »

శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మ వారిని దర్శించుకున్న సబ్ కలెక్టర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్…

పెనుగచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి విచ్చేసిన సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రవీణ్ చంద్ అమ్మ వారిని దర్శనం చేసుకోగా, వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి వారు వీరికి శ్రీ అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు.

Read More »