అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మనుమరాలి వివాహ వేడుకకు హాజరయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయం చెంతన ఈ వేడుక జరగగా, వధూవరులు సుష్మ, కిషన్ లను గవర్నర్ ఆశీర్వదించారు. సుష్మ స్వర్ణ భారత్ ట్రస్ట్ ట్రస్టీ దీపా వెంకట్ కుమార్తె కాగా కరోనా నేపథ్యంలో ఎటువంటి హడావిడికి తావు లేకుండా ముఖ్యుల సమక్షంలో వివాహ వేడుకను నిర్వహించారు. తరువాత శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ , హైదరాబాద్ …
Read More »Andhra Pradesh
శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టిటిడి ఛైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి సాదరంగా స్వాగతం పలికారు. అర్చక బృందం ”ఇస్తికఫాల్” ఆలయ మర్యాదలతో దేవాలయంలోకి తోడ్కొని వెళ్లారు. అనంతరం ఆయన ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీ హరిచందన్ కు వేదపండితులు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు …
Read More »సమానత్వ స్ఫూర్తిని లోకానికి చాటిన జగద్గురు రామానుజాచార్యులు…
-మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ -‘శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం’ వేడుకలకు హజరైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : సమానత్వ స్ఫూర్తిని లోకానికి చాటిన జగద్గురు శ్రీ రామానుజాచార్యుల బోధనలు ఆచరణీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. వైష్ణవ దీక్షకు వర్ణాంతరం లేదని, భగవంతుని ఆరాధనకు ప్రతి ఒక్కరూ అర్హులేనని రామానుజాచార్యులు స్పష్టం చేసారన్నారు. హైదరాబాద్ ముచ్చింతల్ లో జరుగుతున్న సమతా మూర్తి శ్రీ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ వేడుకలకు గురువారం గవర్నర్ హాజరయ్యారు. ఫిబ్రవరి 2 న ప్రారంభమైన ఈ …
Read More »నూజివీడు డివిజన్ లో 5 కోవిడ్ కేసులు : ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు డివిజన్ లో ఫిబ్రవరి 10వ తేదీన 5 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. నూజివీడు రూరల్ మండలం లో 2, నూజివీడు పట్టణంలో 3 కేసులు నమోదయ్యాయన్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, సానిటైజెర్ వినియోగించాలని, బహిరంగ ప్రదేశాలలో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వంతో సహకరించాలని ఆర్డీఓ రాజ్యలక్ష్మి ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
Read More »ప్రజాస్వామ్య బలోపేతానికి జాతీయ ఓటరు అవగాహన పోటీలు…
-క్విజ్,వీడియో మేకింగ్, పోస్టర్ డిజైన్, సాంగ్ మరియు స్లోగన్ విభాగాల్లో పోటీలు -ఔత్సాహిక, వృత్తిపరమైన మరియు సంస్థాగత వర్గాలు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు -ప్రథమ, ద్వితీయ, తృతీయ, స్పెషల్ మెన్షన్ విజేతలకు నగదు పురస్కారాలు -ఎంట్రీలు మార్చి 15 లోపు voter-contest@eci.gov.in కు ఇ-మెయిల్ చేయాలి -రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో పాల్గొనేలా జిల్లా ఎన్నికల అధికారులు కృషిచేయాలి -రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యక్తుల ప్రతిభను, సృజనాత్మకతను వెలికితీస్తూ వారి క్రియాశీల ప్రమేయం ద్వారా …
Read More »నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సుల అవార్డులకు నామినేషన్ల ఆహ్వానం
-ఈ నెల 15 లోపు నామినేషన్లను అందజేయాలి -ఎంపికైన వారికి రూ. 50 వేల నగదుతో సర్టిఫికేట్, పతకం బహూకరణ -రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డా.ఎం.రాఘవేంద్రరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని నర్సులు మరియు నర్సింగ్ నిపుణులు అందించిన విశేష సేవలకు గుర్తింపుగా జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సుల అవార్డులు-2022 బహూకరణకు నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డా.ఎం.రాఘవేంద్రరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డు …
Read More »శ్రీ బాల శివసుబ్రమణ్యస్వామి దేవాలయం లో నవరాత్రుల ముగింపు ఉత్సవాలు…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామంలోని శ్రీ బాలశివసుబ్రమణ్య స్వామి ఆలయంలో రేపు శుక్రవారం ఉదయం 9గం॥లకు నవరాత్రులుముగింపు ఉత్సవాలు పూజ్యశ్రీ కృష్ణ స్వామి అథ్వర్యంలో అత్యంతవైభోవేతంగా నిర్వహించనున్నారని, అమ్మ వారికి రాజశ్యామల హోమం, మహామంగళ పూర్ణాహుతి, 108 సుహాసినులతో (ముత్తైదువలు) కుంకుమార్చన అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించబడునని భక్తులు విశేష సంఖ్యలో హాజరుకావలసినదిగా దేవాలయ నిర్వాహకులు కార్యదర్శి మరియు ప్రథాన అర్చకులు తెలిపారు.
Read More »విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుందాం… రిజర్వేషన్లను పరిరక్షించుకుందాం…
-బహుజనప్రజా చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు దొంతా సురేష్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : బహుజనప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో గురువారం గుంటూరు, అరండల్ పేటలోని రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు దొంతా సురేష్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 1966లో తెలుగువారు పోరాడి సాధించుకున్న భారీ పరిశ్రమ విశాఖ ఉక్కు కర్మాగారం, ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 100% వేయాలని కేంద్రం బిజెపి ప్రభుత్వం నిర్ణయించిందని ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని …
Read More »బ్యాంకు దావాలను పరిష్కరించాలి…
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : మర్చి 12న జరిగే జాతీయ లోకదాలత్లో బ్యాంకర్ల దావాలు పరిష్కరించాలని బ్యాంకు అధికార్ల సమావేశములో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యాయ మూర్తి టి. రామచంద్రుడు, అదనపు సీనియర్ సివిల్ న్యాయ మూర్తి కె. వాణి బ్యాంకర్స్ ను కోరారు. గురువారం కోర్టు హాలులో జరిగిన సమవేశం నందు న్యాయ మూర్తులు మాట్లాడుతూ కక్షి దారులకు జాతీయ లోక్ అదాలత్ గురించి తెలియజెసి ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించడానికి చొరవ చూపాలని బ్యాంకర్లను కోరారు. ఈ సమావేశంలో వివిథ …
Read More »ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా చర్యలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-సత్యనారాయణపురంలో రూ.13.27 లక్షలతో డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు తెలిపారు. సత్యనారాయణపురం ఆదిశేషయ్య వీధిలో సర్కిల్-2 కార్యాలయం నుండి వ్యాకరణం వారి వీధి గుండా ఎన్.ఆర్.పి.రోడ్డు వరకు రూ. 13.27 లక్షల విలువైన డ్రెయిన్ నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ శర్వాణి మూర్తితో కలిసి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి …
Read More »