కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజినల్ పౌర సంబంధాల అధికారి ఎమ్. లక్ష్మణాచార్యులు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్ చేతులు మీదుగా ఉత్తమ అధికారిగా మెరిట్ అవార్డ్ ను అందుకున్నారు. ఆదివారం మచిలీపట్నం లో నిర్వహించిన కృష్ణా జిల్లా 75వ వేడుకల్ని నిర్వహించారు. కోవిడ్ సమయంలో గత 15 నెలలుగా సమాచార శాఖ రాష్ట్ర సమాచార కేంద్రం, విజయవాడలో పిఆర్వో గా అందించిన సేవల నేపథ్యంలో అవార్డ్ ను ప్రకటించారు. లక్ష్మణాచార్యులు కు అభినందనలు …
Read More »Andhra Pradesh
ప్రతి పౌరుడికి, మొత్తంగా 140 కోట్ల భారతీయులకు… నిండు మనసుతో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు!
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ ప్రభుత్వ విభాగాలు రూపొందించిన శకటాల ప్రదర్శనను సీఎం తిలకించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్ధేశించి సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ నేడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం! 74 ఏళ్ళు పూర్తయి 75వ ఏట అడుగుపెడుతున్నాం. ఈ …
Read More »ఘనంగా జరిగిన 75వ స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సర్వశోభాయమానమైన అలంకృత వాహనంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి పోలీస్ పేరేడ్ ను పరిశీలించారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన 75వ స్వాతంత్యదినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పెరేడ్ కమాండర్ , విశాఖపట్నం రూరల్ అడిషినల్ యస్ పి యస్. సతీష్ కుమార్ ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డిని పెరేడ్ పరిశీలనకు రావాల్సిందిగా ఆహ్వానించారు. దీనితో పెరేడ్ పరిశీలనకు ప్రత్యేక అలంకృతవాహనంలో ముఖ్యమంత్రి వాహనంలో తరలివెళ్లారు. …
Read More »రాష్ట్ర అభివృద్ధి సంక్షేమరంగాలపై అలంకృత శకటాల ప్రదర్శన…
-ఆకట్టుకున్న అలంకృత శకటాలు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అమలుచేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలియజేస్తూ ప్రదర్శింపబడిన అలంకృత శకటాలు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు శోభను చేకూర్చాయి. రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని కళ్లకు కట్టిన్నట్లుగా వివరించేవిధంగా 15 ప్రచార శకటాలను ఈస్వాతంత్య దినోత్సవ వేడుకలలో ప్రదర్శించబడ్డాయి. ఈశకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్థానిక ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన 75వ స్వాతంత్యదినోత్సవ వేడుకలలో ప్రదర్శింపబడిన శకటాలలో ప్రధమ ఉత్తమశకటంగా స్త్రీ, …
Read More »ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ జె.నివాస్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్వాగతం పలుకుతూ ముఖ్యమంత్రి షర్ట్ కు జాతీయ జెండా చిహ్నాన్ని కలెక్టర్ ఆలంకరించారు.
Read More »ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన సబ్ కలెక్టర్ జిఎస్ఎస్ ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవ స్పూర్తిగా దేశ సమైక్యత, సమగ్రతలకు మరింత కృషి చేసి అభివృద్ధి దిశగా అడుగులు వేద్దామని విజయవాడ సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్ అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ఈ శుభ సమయాన దేశ …
Read More »ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యం…
-వైద్య సంస్థలకు ప్రభుత్వ సహకారం -అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో ఆసుపత్రిని స్థాపించడం శుభపరిణామం -అను మై బేబీ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఉపముఖ్యమంత్రి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) -‘అను మై బేబీ’ ద్వారా అంతర్జాతీయ స్థాయి ప్రసూతి, నవజాతశిశు వైద్య సేవలు -అను హాస్పిటల్స్ సీఈవో డాక్టర్ గాజుల రమేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో …
Read More »విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి అమరజీవి పింగళి వెంకయ్య పేరుగా నామకరణం చేయాలి… : తమ్మిశెట్టి చక్రవర్తి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మారుతీనగర్ లోని ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి ముందుగా డా.బి.ఆర్. అంబెడ్కర్, మహాత్మా గాంధీ, పూలే చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జండాని ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు మనకి స్వాతంత్య్ర దినోత్సవం గత 75 సంవత్సరాలు జరుపుకోవడం ఎందరో మహానుభావులు త్యాగఫలం. …
Read More »జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యాచరణ, కార్యకర్తలకు భరోసాగా నిలిచే అంశాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో పార్టీ ప్రధాన కార్యదర్శులు చిలకం మధుసూదన్ రెడ్డి, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పెదపూడి విజయ్ కుమార్, పార్టీ నేతలు పోతిన మహేష్, చిల్లపల్లి శ్రీనివాస్, బండ్రెడ్డి రామకృష్ణ, గాదె వెంకటేశ్వరరావు, జిలానీ, డా. పాకనాటి గౌతం, …
Read More »జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…
-జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఆదివారం పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. వజ్రోత్సవ వేళ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండా రెపరెపలాడుతుంటే దేశభక్తి ఉప్పొంగింది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ …
Read More »