Breaking News

Andhra Pradesh

డోసుల మధ్య ఎంత విరామం అవసరం? తేడా వస్తే?

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రెండో డోసు వ్యాక్సిన్‌ తీసుకోవడంలో వారం పది రోజులు ఆలస్యమైనా పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదు. సాధారణంగా మొదటి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది. తొలి డోసు ఏ కంపెనీ టీకా అయితే వేసుకుంటామో.. రెండో డోసు కూడా విధిగా అదే కంపెనీ టీకా వేసుకోవాల్సి ఉంటుంది. వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకోవద్దు. ఆ అవసరం కూడా ఉండదు. టీకా వేయించుకునే ముందు చాలా మంది కోవిడ్‌ పరీక్షలు చేయిస్తున్నారు. నిజానికి …

Read More »

సిటీ స్కాన్ గురించి కచ్చితంగా తెలుసుకోవలసినవి

నేటి పత్రిక ప్రజా వార్త : ఇవాళ చాలా మందికి కరోనా ఉన్నదా? లేదా? అని తెలుసుకోవడానికి, కరోనా జబ్బు వచ్చిన తర్వాత ఎలా ఉంది..? ఎంత తీవ్రత వుంది..? అని తెలుసుకోవడానికి సిటీ స్కాన్ చేస్తున్నారు. ఈ సిటీ స్కాన్ లో రెండు పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి CORADS రెండు CT Severity Index CORADS: దీనిలో స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు ఉంటాయి. CORADS అనేది సిటీ స్కాన్ ప్రకారం కరోనా ఉండే అవకాశాలు ఎంత? …

Read More »

అందరివాడు కనమర్లపూడి దామోదర్…

–మనసున్న మారాజు కనమర్లపూడి దామోదర్  విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త : సామాజికవేత్త, వైసిపి నాయకులు, సాయి పురం కాలని ప్రెసిడెంట్, ఆర్యవైశ్య సేవా సంఘం గొల్లపూడి వ్యవస్థాపక అధ్యక్షులు, నిరంతరం ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తూ…. ఆర్యవైశ్య సంఘానికి మరో పేరుగా, రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న కనమర్లపూడి దామోదర్ 13వ తేదీ స్వర్గస్తులైన సందర్భంగా 23వ తేదీ చివరి రోజున ముగిసిన కార్యక్రమానికి పలువురు నగర ప్రముఖులు, పండితులు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు, వివిధ పార్టీల …

Read More »

జాగ్రత్త.. కళ్లకలక కూడా కరోనా కావచ్చు!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కరోనా వైరస్ ఊహించని విధంగా విస్తరిస్తోంది. కరోనా లక్షణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా ఫస్ట్ వేవ్ కు, సెకండ్ వేవ్ కు ఎంతో వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం వైరస్ పలు విధాలుగా మార్పులు చెందుతున్న తరుణంలో, వ్యాధి లక్షణాలు కూడా మారుతున్నాయి. గాలి ద్వారా కూడా కరోనా విస్తరిస్తోందని నిపుణులు చెపుతున్న మాటలు ఆందోళన కలిగించేవే. ఎలాంటి కోవిడ్ లక్షణాలు కనిపించకుండానే ఎంతో మంది వైరస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. …

Read More »

వేలిముద్రలు, ఐరిస్‌ యంత్రాలతో కరోనా సోకే ప్రమాదంవుంది జాగ్రత్త… 

నేటి పత్రిక ప్రజావార్త : ఆధార్‌ సేవా కేంద్రాలు కొవిడ్‌ వ్యాప్తికి కారణమవుతున్నాయి. వేలిముద్రలు, ఐరిస్‌ను పరిశీలించే స్కానర్లు ఇందుకు దోహదపడుతున్నాయి. మీసేవా, బ్యాంకుల్లోని ఆధార్‌ కేంద్రాలు నడిపించే సిబ్బంది నిత్యం ఏదో ఓ ప్రాంతంలో కొవిడ్‌కు గురవుతుండటమే ఇందుకు నిదర్శనం. వినియోగదారులు సైతం ప్రభావితమవుతున్నారు. రక్షణ చర్యల విషయంలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల పరిస్థితి తీవ్రరూపం దాల్చుతోంది. వేలి ముద్రల సమస్యతో ఆధార్‌ కేంద్రాలను ఆశ్రయిస్తున్న వృద్ధులు, కొత్తగా ఆధార్‌కార్డు తీసుకునే చిన్నారులు మహమ్మారి బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Read More »

శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మస్థలం అంజనాద్రి

తిరుమ‌ల‌, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మస్థలం అంజనాద్రి అని పౌరాణిక‌, వాఙ్మ‌య‌, శాస‌న‌, భౌగోళిక ప్రమాణాల‌తో టిటిడి నిరూపించింది. ఈ మేర‌కు పండితుల క‌మిటీ త‌యారుచేసిన నివేదిక‌ను శ్రీ‌రామ‌న‌వ‌మి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని బుధ‌వారం తిరుమ‌ల‌లోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆవిష్క‌రించారు. కార్య‌క్ర‌మానికి విచ్చేసిన త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ భ‌న్వారిలాల్ పురోహిత్‌ మాట్లాడుతూ శ్రీ‌రాముని జ‌న్మ‌స్థానం అయోధ్య అని, ఇక‌పై రామ భ‌క్తుడైన హ‌నుమంతుని జ‌న్మ‌స్థానం తిరుమ‌ల అన్నారు. టిటిడి ఈ విష‌యాన్ని శాస్త్రబ‌ద్ధంగా నిరూపించింద‌న్నారు. తాను హ‌నుమంతుడి భ‌క్తుడిన‌ని, ఈ విష‌యం …

Read More »

కరోనాకు ఇంజెక్షన్ బదులు టాబ్లెట్​…

-చివరి దశకు చేరుకున్న ట్రయల్స్ నేటి పత్రిక ప్రజావార్త : కరోనా మహమ్మారితో సీరియస్​ అవుతున్న పేషెంట్లకు ఇప్పుడు రెమ్డెసివిర్​ ఇంజెక్షన్లతో ట్రీట్​మెంట్​ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే దానిని టాబ్లెట్ల రూపంలో ఇచ్చేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో మరో ‘టాబ్లెట్​’ కరోనాను తగ్గిస్తోందట. ఇప్పటికే ఫ్లూ కోసం వాడుతున్న మోల్నుపిరావిర్​ (ఎంకే 4482) అనే మందు హామ్​స్టర్స్​ (ఓ రకం ఎలుకలు) పై బాగా పనిచేస్తోందట. అమెరికాలోని నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్ (ఎన్​ఐహెచ్​) కు చెందిన సైంటిస్టులు ఎలుకలకు ఈ మందులిచ్చి చూడగా …

Read More »

“సమ్మర్ లో ఈ ‘బియ్యం’ తినండి” 

నేటి పత్రిక ప్రజావార్త : వేసవి కాలంలో సగ్గు జావ తాగితే చాలా మంచిది. ఎందుకంటే సగ్గు బియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దాంతో అలసిన శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అంతేకాకుండా ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. సగ్గు బియ్యంలోని పొటాషియం రక్త ప్రసరణను సాఫీగా చేసి గుండె మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా సాయపడుతుంది. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. సగ్గు బియ్యంలోని క్యాల్షియం వల్ల ఎముకలకు బలం పెరుగుతుంది.

Read More »

ఇంటిలో, ఆఫీసులో ఒకరికి కరోనా వచ్చిందని తెలియగానే మిగతా వారు ఏం చేయాలి?

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తూనే ఉంది. గత వారం రోజులుగా దేశంలో 2లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం ఇంట్లో, ఆఫీసులో ఇతర ప్రదేశాల్లోనో స్నేహితులు, ఇతరులతో దగ్గరగా ఉండాల్సి వస్తుంది. ఒకవేళ ఇంటిలో, ఆఫీసులో ఎవరైనా ఒకరికి కరోనా వచ్చిందని తెలియగానే, మిగతా వారు ఏమి చేయాలి అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన సహచరుడికి కరోనా వచ్చిందని తెలియగానే మన తీసుకోవాల్సిన జాగ్రత్తలు. * కరోనా వచ్చిన వ్యక్తితో పది …

Read More »

శ్రీ పాండురంగస్వామి(విఠల్ రుఖ్మిని) ఆలయం

నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ పాండురంగస్వామి(విఠల్ రుఖ్మిని) ఆలయం, పండరీపురం, మహారాష్ట్ర. భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో దేని విశిష్టత దానిది. వీటిలో కొన్ని శైవక్షేత్రాలు, మరికొన్ని వైష్ణవ క్షేత్రాలు. మన రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన తిరుమలగా మహారాష్ట్రలోని పండరిపురం వైష్ణవ క్షేత్రం. భీమా నదీ తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం షోలాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ‘విఠోబా’ పేరుతో వెలసియున్నాడు. విఠోబా లేక వితోబా అనే పేరు పురాణాలలో కూడా ఉంది. మన దేశంలో ఉన్న శ్రీ పాండురంగస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా …

Read More »