Breaking News

నగరంలో ఎమ్మడి సిల్వర్‌ జ్యువెలరీ షోరూం ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో నూతనంగా ఎమ్మడి సిల్వర్‌ జ్యువెలరీ షోరూం ప్రారంభ కార్యక్రమంలో సినీనటి మీనాక్షి చౌదరి విచ్చేసి సందడి చేశారు. శనివారం బందరురోడ్డులో ఎమ్మడి సిల్వర్‌ జ్యువెలరీ షోరూం నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ షోరూంలో ఆకట్టుకునే డిజైన్లతో ఉన్న వెండి ఆభరణాలను చూసి ముగ్ధురాలైనట్లు తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఆభరణాలు ఇప్పుడు విజయవాడలో అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. బ్రైడల్‌ జ్యువెలరీ, అధునాతన, సాంప్రదాయ డిజైన్లకు ప్రత్యేకమైన చెక్కిన డిజైనర్‌గా పేరుగాంచినది ఎమ్మడి సిల్వర్‌ జ్యువెలరీ అన్నారు. ఆభరణాల ప్రియులు ప్రతి ఒక్కరు ఎమ్మడి సిల్వర్‌ జ్యువెలరీ సందర్శించాలని కోరారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తెలుగు ప్రేక్షకుల విజయం అని చెప్పారు. సంస్థ సిఇఒ ఎమ్మడి సునీత ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ అందరికి అందుబాటులో నాణ్యమైన, అత్యాధునిక డిజైన్లతో అందరినీ ఆకట్టుకునే డిజైన్లతో అందుబాటు ధరలతో నగరంలో నూతనంగా స్థాపించిన నిర్వాహకులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎమ్మడి రమేష్‌ మాట్లాడుతూ ఎమ్మడి సిల్వర్‌ జ్యువెలరీ ద్వారా తాము భారతదేశంలో అతిపెద్ద బ్రైడల్‌ సిల్వర్‌ జ్యువెలరీ బ్రాండ్‌ను ప్రదర్శించడం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు.త్వరలో మరిన్ని స్టోర్‌లు రానున్నందున మేము మరింత విస్తరిస్తామన్నారు. మేము ఇటీవల యూఎస్‌ఏలో మా స్టోర్‌ను ఆవిష్కరించామని తెలిపారు. అత్యుత్తమ పనితనం సృజనాత్మకతకు ప్రసిద్ధి చెందిన మా బ్రాండ్‌, సంప్రదాయం ఆధునికతను మిళితం చేసే డిజైన్లతో బ్రైడల్‌ సిల్వర్‌ జ్యువెలరీలో ప్రత్యేకత కలిగి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, ఆభరణాల ప్రియులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *