Breaking News

Latest News

ప్రభుత్వ ఫ్యామిలీ డాక్టర్‌ శివారు గ్రామాలలో సేవలందించాలి…

-నిరుపేదలకు ఉత్తమ సేవలు అందిస్తున్న ఫ్యామిలీ డాక్టర్లే ప్రత్యక్ష దేవుళ్ళు.. -జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఫ్యామిలీ ఫిజీషియన్‌ విధానం అమలు జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ఫిజిషియన్‌ విధానం అమలులో పిహెచ్‌సి స్థాయిలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తున్న వైద్యులను సోమవారం కలెక్టరేట్‌ పింగళివెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సన్మానించారు. ఈ …

Read More »

ని-క్షయ్‌ మిత్రల ద్వారా క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్షయ వ్యాధిని సమూలంగా నివారించి క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు అన్నారు. ప్రధాన మంత్రి టిబి ముక్త భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధి నివారణ కొరకు నిర్వహిస్తున్న ని-క్షయ్‌ మిత్రల ఏర్పాట్లపై సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ, టిబి కంట్రోల్‌ అధికారులు, ఇండియ రెడ్‌క్రాస్‌ సోసైటీ వివిధ స్వచ్చంద సంస్థ ప్రతినిధులతో …

Read More »

మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం…

-చేపల వినియోగాన్ని పెంచేందుకు అక్వా హబ్‌లు ఏర్పాటు… -జిల్లాలో ఫిష్‌ రిటైల్‌ అవులెట్లు ద్వారా మత్స్యకారులకు ఆర్థిక భరోసా… -జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేపల వినియోగాన్ని పెంచేందుకు జిల్లాలో ఫిష్‌ రిటైల్‌ అవులెట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుని మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్న జాతీయ మత్స్య దినోత్సవం కార్యక్రమాన్ని కలెక్టరేట్‌ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ …

Read More »

పర్యావరణాన్ని కాపాడి మత్స్య సంపదను పెంపొందిద్దాం !!

-కలెక్టర్ రంజిత్ బాషా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణాన్ని కాపాడడంతో పాటు మత్స్య సంపదను పెంపొందించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అన్నారు. సోమవారం ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మచిలీపట్నంలోని జిల్లా పరిషత్‌ సమావేశపు మందిరంలో స్థానిక నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ, కొన్ని అధ్యయనాల ప్రకారం సముద్రపు చేపల వల్ల ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయని వెల్లడైందన్నారు. ఎన్నో …

Read More »

ప్రతిష్ఠాత్మక ఐఐఎం(అహ్మదాబాద్)తో సీమ్యాట్ ఒప్పందం

-పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా ఎస్పీడీ ఎస్. సురేష్ కుమార్  -ఐఐఎంఏలో ఐదు రోజుల పాటు శిక్షణ పొందుతున్న 50 మంది ప్రధానోపాధ్యాయులు -వినూత్న బోధనాలోచనలకు కృషి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని గుణాత్మక విద్య, వినూత్న బోధన ఆలోచనలకు నాంది పలికేలా ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా తరఫున స్యీమాట్ (State Institute of Educational Management and Training)విభాగం ప్రతిష్ఠాత్మకమైన విద్యా అగ్రగామి సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (అహ్మదాబాద్)తో అవగాహన ఒప్పందం …

Read More »

సిటిజెన్ పర్సెప్షన్ సర్వే…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం వారు చేపట్టిన సిటిజెన్ పర్సెప్షన్ సర్వేలో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, సోమవారం రాజీవ్ గాంధీ పార్కులో హిజ్రాలతో మమేకమయ్యే కార్యక్రమం నిర్వహించారు. హిజ్రాలను వివక్షతో చూడకూడదు వారు మన సమాజంలో అందరితో సమానమనే ఉద్దేశంతో వారితో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారు కాసేపు అలా పార్క్లో సేదతీరి, అధికారులతో ఫోటోలు దిగారు. అదే విధంగా హిజ్రాలతో కలసి ఈజీ …

Read More »

పారా జాతీయ స్విమ్మింగ్ పోటీలలో గోల్డ్ 10, వెండి 5 పతకాలు…

-అభినందించిన కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అస్సాం రాష్ట్రం గౌహతి లో ఈ నెల 11 నుండి 13 వ తేదీ వరకు జరిగిన పారా జాతీయ స్విమ్మింగ్ పోటీలలో (వికలాంగుల) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి మొత్తం 35 పతకములు రాగ అందులో 15 పతకాలు విజయవాడ సంభందించి జింఖానా గ్రౌండ్ నందు సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ లో శిక్షణ పొందిన వారికి రావడం జరిగినది. అందులో గోల్డ్ 10, వెండి 5 పతకాలు వచ్చాయి. …

Read More »

స్పందన కార్యక్రమములో 15 అర్జీల రాక…

-ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే స్పందన కార్యక్రమము ముఖ్యోద్దేశం, -నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాసమస్యల పరిష్కార దిశగా ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమములో భాగంగా న‌గ‌ర పాల‌క సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు కమీషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంలో ప్రజలు స్పందనలో పెట్టుకున్న అర్జీలను మరొకసారి పునరావృతం కాకుండా తక్షణమే పరిష్కార దిశగా చర్యలు చేపట్టి ఆయా …

Read More »

ఎక్సెల్ ప్లాంట్ల సందర్శన, పనులను వేగవంతం చేయాలని ఆదేశాలు…

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్ నగర్ నందలి ఎక్సెల్ ప్లాంట్ ను కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, అధికారులతో కలసి సోమవారం ప్లాంట్ ఆవరణలో ఎంట్రన్స్ గేట్లు, శానిటరీ ఆఫీసు బిల్డింగ్, స్టోర్ రూమ్, డ్రైవర్స్ టాయిలెట్స్(రెస్ట్ రూమ్) నిర్మాణం జరుగుతున్న పనులను సందర్శించి పలు సూచనలు చేశారు. ప్లాంట్ ఆవరణలో జరుగుతున్న రోడ్ల పనులను పదిహేను రోజుల లోపుల పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారిచేసినారు. అదే విధంగా ఎక్సెల్ …

Read More »

రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం…. : సాదరబోయిన ఏడుకొండలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగన్ ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాదరబోయిన ఏడుకొండలు అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాథ్(చిన్ని) కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సాదరబోయిన ఏడుకొండలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు జగన్ ముఖ్యమంత్రిగా ఉండటం మాకు ఇదేం కర్మ అని భావిస్తున్నారని, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని, ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోని ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పరిపాలన చేయడానికి ఏమాత్రం అర్హత లేదని …

Read More »