-అభినందించిన కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అస్సాం రాష్ట్రం గౌహతి లో ఈ నెల 11 నుండి 13 వ తేదీ వరకు జరిగిన పారా జాతీయ స్విమ్మింగ్ పోటీలలో (వికలాంగుల) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి మొత్తం 35 పతకములు రాగ అందులో 15 పతకాలు విజయవాడ సంభందించి జింఖానా గ్రౌండ్ నందు సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ లో శిక్షణ పొందిన వారికి రావడం జరిగినది. అందులో గోల్డ్ 10, వెండి 5 పతకాలు వచ్చాయి.
సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమీషనర్ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు కమీషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ గారిని డైరెక్టర్ అఫ్ స్పోర్ట్స్ టి. శ్రీనివాస్ గారితో కలిసి ఎ.లక్ష్మణరావు స్విమ్మింగ్ పూల్ కోచ్ మరియు స్టూడెంట్స్ లతో మర్యాద పూర్వకంగా కలిసినారు. ఈ సందర్బంలో విజేతలుగా నిలిచిన కోచ్ మరియు స్టూడెంట్స్ ని అభినందిస్తూ, భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించి నగరానికి మణిహారంగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్ధులు క్రీడల పట్ల ఆశక్తి కనపరచి ఉన్నతంగా రాణించాలని, క్రీడాకారులకు ప్రభుత్వం నుండి అనేక ప్రోత్సాహాలు మరియు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుందని అన్నారు. స్విమ్మింగ్ పట్ల ఆశక్తి కనపరచుట ఎంతో అభినందనీయమని, కొనియాడుతూ రాభోవు రోజులలో మరిన్ని విజయాలు సాధించి క్రీడాకారునిగా మంచి గుర్తింపును పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంలో శిక్షణ కల్పించిన కోచ్ ను అభినందించినారు.
Para national swimming championships 2022 Guwahati Assam
1. A.lakshmanarao
vmc swimming coach
Got 3 gold
2.Md.karumulla
Got 2 gold 1 silver
3.Gitendra
Got 1gold 1 silver
4.Sk Salma
Got 3 silver
Prajavartha Online Telugu News