Breaking News

Latest News

ప్రకాశం జిల్లా తమ్మలూరు గ్రామం ఆర్యవైశ్య సంఘం కార్తీక వన సమారాధన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం జిల్లా తమ్మలూరు గ్రామం ఆర్యవైశ్య సంఘం కార్తీక వన సమారాధన కొత్తూరు తాడేపల్లిలోని అటవీశాఖ ఉద్యానవనంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు, వై.యస్‌.ఆర్‌.సి.పి వాణిజ్య విభాగం అధ్యక్షులు పల్లపోతు మురళీకృష్ణ హజరయ్యారు. అనంతరం వారిని సంఘం సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కోట పుల్లారావు, మిత్తింటి చంద్రశేఖర్‌, కోట గుర్నాధరావు తదితరులు మాట్లాడుతూ …

Read More »

మనిషి ప్రాణం చాలా విలువయినవి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వరల్డ్ రెమెంబెరన్స్ డే కార్యక్రమాన్ని ట్రాన్స్పోర్ట్ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాల గొప్పగా స్థానిక రామచంద్ర పుష్కరిణియందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఆక్సిడెంట్ భాతితులకు 2౦౦౦ ఆర్థిక సహాయం అందజేశారు. అలానే మాట్లాడుతూ మనిషి ప్రాణం చాలా విలువయినవని, ప్రయాణాళ్ళలో హెల్మెట్ , కార్ సీట్ బెల్ట్ ధరించుట చాల మంచిదని తెలియచేసారు. కుటుంబంలో ఏ ఒక్కరు మరణించిన , భాదని ఎవ్వరు పూడ్చలేరని తెలియచేసారు. అనంతరం ఆక్సిడెంట్ లో మరణించిన బాధితులకు మౌనంపాటించి …

Read More »

శ్రీ పద్మావతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం మ‌ధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి  నారాయణస్వామి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి టిటిడి జెఈవో  వీర‌బ్ర‌హ్మం, ఆలయ అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఉప ముఖ్య‌మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం తన పూర్వ‌జ‌న్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి  వైఎస్.జగన్ …

Read More »

స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న గిరిజన మహనీయులకు నివాళి… : వడిత్య శంకర్ నాయక్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా ఆజాది కా అమృత మహోత్సవం జరుపుకుంటున్నామని అందులో భాగంగా స్వాతంత్ర సమరంలో పాల్గొన్న గిరిజన మహనీయులను గుర్తించుకునే విధంగా గిరిజన గౌరవ దినోత్సవ ఉత్సవాలు-2022 జరుపుకుంటున్న సందర్భంగా నేడు నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ అన్నారు. ఆదివారం  స్థానిక ఎం. ఆర్. పల్లి సర్కిల్ నుండి గిరిజన గౌరవ దినోత్సవ ఉత్సవాలు-2022 ర్యాలీని ఎస్టీ కమిషన్ సభ్యులు , డిఆర్ఓ శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమ అధికారి …

Read More »

అన్నయ్య చిరంజీవి కి హృదయపూర్వక అభినందనలు… 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు చలన చిత్రసీమలో శిఖర సమానులు, అన్నయ్య చిరంజీవి ని ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022’ పురస్కారం వరించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో భాగంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం. ఈ ఆనంద సమయంలో నా మార్గదర్శి అన్నయ్య చిరంజీవి కి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. నాలుగు దశాబ్దాలుపైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను …

Read More »

ఆయుర్వేద, నేచురో పతి, హోమియోపతి, సిద్ధ, యునాని వైద్యం ప్రజలకు చేరువ చేసేందుకు అవగాహన ర్యాలీ

-జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా ఎస్. టి. జి. సత్యగోవింద్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆయుష్ మంత్రిత్వ శాఖ జాతీయ ఆయు ర్వేద పర్వ్ 3 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు ఆయుర్వేద, నేచురో పతి, హోమియోపతి, సిద్ధ, యునాని వైద్యం ప్రజలకు చేరువ చేసేందుకు అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి, డా ఎస్. టి. జి. సత్య గోవింద్ అన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ జాతీయ ఆయు ర్వేద …

Read More »

గత 10 ఏళ్ళల్లో ఎటువంటి ఆధార్ అప్డేషన్ట్ చేయనివారు తప్పనిసరిగా ఆధార్ కార్డు నవీకరణ చేసుకోవాలి

-జిల్లాలో 47 ప్రత్యేక ఆధార్ అప్డేషన్ కేంద్రాలు – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని 42 ఆధార్ నమోదు ప్రత్యేక కేంద్రాల ద్వారా నవంబర్ 18, 19 తేదీల్లో 2,288 మంది కి చెందిన ఆధార్ లావాదేవీలను నిర్వహించగా జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీ లత ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆధార్ కార్డు కలిగి ఉండి గత 10 సంవత్సరాల పాటు ఎటువంటి లావాదేవీలను నిర్వహించని ప్రతి ఒక్కరూ ఆధార్ లావాదేవీలో భాగంగా నవీకరించడం …

Read More »

వివిధ కంపెనీల్లో 1200 ఉద్యోగాలు కోసం నవంబర్ 22 మంగళవారం మెగా జాబ్ మేళా

– డిఆర్డిఎ పిడి ఎస్. సుభాషిణి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 22 మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఎస్. సుభాషిణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మెగా జాబ్ మేళా కు 15 కంపెనీ లు హాజరు కావడం ద్వారా సుమారు 1200 మందికి ఉద్యోగాలు కోసం ఇంటర్వూ లను నిర్వహిస్తున్నామన్నారు. డా.బి.ఆర్.అంబేద్కర్ ప్రభుత్వ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్, …

Read More »

విజ్ఞానాన్ని గ్రంథాలయాలలో ఉన్న రకరకాల పుస్తకాలు చదవడం ద్వారా పొందవచ్చు…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయం ` కొవ్వూరు కొవ్వురు ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయములొ ది.14-11-2022 నుండి నిర్వహించుచున్న 55 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు దినోత్సవం సభను ఈ రోజు ది.20-11-2022 న నిర్వహించడమైనది. ఈ కార్యక్ర్రమంలో ముఖ్య అతిథులుగా కె.శారదాంబ, మెజిస్ట్రేట్‌, కొవ్వూరు, ఎస్‌.మల్లిబాబు, రెవిన్యూ డివిజనల్‌ అధికారి, కొవ్వూరు మరియు పి.చంద్రశేఖర్‌, డివిజనల్‌ వ్యవసాయాధికారి, కొవ్వూరు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ముందుగా హాజరైన విద్యార్థులచే స్వీయపఠనము(చదవడం మాకిష్టం) కార్యక్రమం  గోవర్థనం శ్రీనివాసమూర్తి, …

Read More »

డా. వైయస్ఆర్ పశు ఆరోగ్య సేవా రథాలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని అన్ని నియోజక వర్గాల లో 1962 డా. వైయస్ఆర్ పశు ఆరోగ్య సేవా రథాలు (నా సంచార పశు వైద్య వాహనాలు) లలో పనిచేయుటకు వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, పైలట్స్ (డ్రైవర్స్) భర్తీ కోసం దరఖాస్తులు కోరడం జరుగుతోందని జిల్లా పశు వైద్య అధికారి డా ఎస్ జి టి సత్య గోవింద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండో విడతలో భాగంగా సంచార పశు సేవా 1962 వాహనాలు …

Read More »