తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా ఆజాది కా అమృత మహోత్సవం జరుపుకుంటున్నామని అందులో భాగంగా స్వాతంత్ర సమరంలో పాల్గొన్న గిరిజన మహనీయులను గుర్తించుకునే విధంగా గిరిజన గౌరవ దినోత్సవ ఉత్సవాలు-2022 జరుపుకుంటున్న సందర్భంగా నేడు నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ అన్నారు. ఆదివారం స్థానిక ఎం. ఆర్. పల్లి సర్కిల్ నుండి గిరిజన గౌరవ దినోత్సవ ఉత్సవాలు-2022 ర్యాలీని ఎస్టీ కమిషన్ సభ్యులు , డిఆర్ఓ శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమ అధికారి చెన్నయ్య ప్రారంభించారు.
ఎస్టీ కమిషన్ సభ్యులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆజాది కా అమృత మహోత్సవాలు జరుపుకుంటున్నామని అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో కార్యక్రమాలు జరుపుతున్నామని అన్నారు. జార్ఖండ్‌కు చెందిన భగవాన్ బిర్సా ముండా మరియు సిద్ధూ-కన్హు, మధ్యప్రదేశ్‌కు చెందిన తాంతియా భిల్ మరియు భీమా నాయక్, ఆంధ్ర ప్రదేశ్‌కి చెందిన అల్లూరి సీతారామ రాజు, మణిపూర్‌కు చెందిన రాణి గైడిన్లియు మరియు ఒడిశాకు చెందిన సహీద్ లక్ష్మణ్ నాయక్ వంటి ఎందరో గిరిజన మహానుభావులు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారని ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవడం మన విధి అని అన్నారు.
డిఆర్ఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆజాది కా అమృత మహోత్సవంలో భాగంగా దేశ స్వతంత్ర సమరయోధులను స్మరించుకోవాలని, గిరిజన గౌరవ దినోత్సవ ఉత్సవాలు-2022 జరుపుకుంటున్న సందర్భంగా స్వాతంత్ర సమరంలో పాల్గొన్న గిరిజన మహానుభావులను గుర్తు చేసుకోవాలని అన్నారు. అదే స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణ , పరిశుభ్రత , ప్లాస్టిక్ నిషేధం వంటివి పాటించాలని అప్పుడే రాష్ట్రం దేశం ఆరోగ్యవంతంగా ఉంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో గిరిజన వసతి గృహాల అధికారులు కళాశాలల ప్రిన్సిపల్ లు హేమలత ప్రసూన ,రత్నప్రభ ,జయంతి , ప్రతిభ విద్యార్థినిలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News