విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఐజా గ్రూప్ తరపున పలువురికి ఆర్థిక సహాయం అందజేసినట్టు ఐజా గ్రూప్ సంస్థల చైర్మన్, జనసేన విజయవాడ నగర అధికార ప్రతినిధి, మైనార్టీ నాయకులు షేక్ గయాజుద్దీన్ ఐజా చెప్పారు. గురువారం భవానిపురం 40వ డివిజన్ లోని కరకట్ట ప్రాంతంలో గల శ్రీ దుర్గా భవాని దేవస్థానం రంగుల నిమిత్తం 16 వేల రూపాయలను ఐజా అందజేశారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న 44వ డివిజన్ కు చెందిన ఫిరోజ్ అనే యువకుడికి 3000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని …
Read More »Latest News
లోన్ అప్ మోసాలపై తీసుకోవాల్సిన జాగ్రతలపై ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండాలి : డిజిపి రాజేంద్ర నాథ్ రెడ్డి
అమరావతి , నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల కాలంలో డిజిటల్ ప్లాట్ ఫారం ద్వారా లావాదేవీలు జరుపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది, అదే విధంగా డిజిటల్ ప్లాట్ ఫారం ద్వార అనేక నేరాలు పెరుగుతున్నాయని ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కే.వి. రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అక్రమ ఋణ అప్ రుణాలు/సూక్ష్మ క్రెడిట్లను అందజేయడం, ముఖ్యంగా బలహీనమైన మరియు తక్కువ ఆదాయ వర్గాలకు అధిక వడ్డీ రేట్లు మరియు ప్రాసెసింగ్/దాచిన చార్జీలతో లోన్లు ఇచ్చి బ్లాక్మెయిలింగ్, నేరపూరిత బెదిరింపులతో కూడిన దోపిడీ, …
Read More »ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు
-బ్యాంకర్లు నిరుద్యోగ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రుణాలు మంజూరులో సహకరించాలి: -తిరుపతి జిల్లా పరిశ్రమలకు అన్ని విధాలా అనుకూలం: ఎం పి గురుమూర్తి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన మంత్రి ఉపాధి కల్పనపై ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మిషన్ ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అవగాహన సదస్సు కు ముఖ్య అతిథిగా గౌ తిరుపతి ఎం పి మద్దెల గురుమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎం పి మాట్లాడుతూ …
Read More »వాల్మీకులకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వాల్మీకి సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి స్థానిక అలంకార్ సర్కిల్‌లో ధర్నాచౌక్ నందు 13వ రోజు చేస్తున్న సత్యాగ్రహ దీక్షలు, నిరవదిక దీక్షలకు సంఫీుభావం తెలుపుతూ మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఉన్నప్పుడు తమ పని తాము చేసామని మిగిలిన పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో …
Read More »వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్, వైయస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డుల ప్రకటన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్, వైయస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డుల ప్రకటన. 2021 నవంబరు 1న… రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారాలుగా ఈ అవార్డుల్ని ప్రదానం చేయటం అందరికీ తెలుసు. – వివిధ రంగాల్లో సామాన్యులుగా ఉన్న అసామాన్యులను ఎంపిక చేసి… తొలి సారి ఇస్తున్న అవార్డుల్లో… 62 సంస్థలకు, లేదా వ్యక్తులకు తొలి అవార్డుల్ని అందజేశాం. ప్రధానంగా మన గ్రామం, మన వ్యవసాయం, మన కళలు, సాహిత్యం, …
Read More »ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కార్నియా కలెక్షన్ కేంద్రాలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కార్నియా కలెక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్స్ మరియు ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ బి.వి.ఎస్. కుమార్ ఒక ప్రకటనలో తెలియజేసారు. రాష్ట్రంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొదటి కార్నియా కలెక్షన్ సెంటర్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు …
Read More »పిడింగొయ్య గ్రామంలో ఈ క్రాప్ రికార్డ్స్ పరిశీలించడం జరిగింది…
-కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ క్రాప్ బుకింగ్, ఈ కేవైసి ద్వారా రైతులు వారు సాగుచేసే పంటకు గిట్టుబాటు ధర, భరోసా పొందగలుగుతారని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత ఆన్నారు. శుక్రవారం మధ్యాహ్నం రాజమండ్రి రూరల్ పిడింగొయ్య గ్రామంలో ఈ క్రాప్ నమోదు చేసుకున్న నలుగురు రైతుల రికార్డ్స్ లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వము రైతులకు విత్తు నుంచి పంట కొనుగోలు చేసే వరకు ప్రతి ఒక్క స్థాయి లోనూ …
Read More »యువతం జాబ్ మేళాలను సద్వినియోగంచేసుకోవాలి..
-జాబ్ మేళాలో 75 కంపెనీల్లో 2700 మంది కి ఉద్యోగాలు … -మరికొందరికి ఉపాధి కల్పన దిశగా యువత నైపుణ్యం పెంచు కోవాలి -జాబ్ మేళాలో ప్రత్యేక ఆకర్షణగా పరిశ్రమల స్టాల్ -ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేత -జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత -యంపి మార్గాని భరత్ రామ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యువత చదువు పూర్తయిన తరువాత వారి భవిష్యత్తును ఎన్నుకొనేందుకు ఏ రంగంలో స్థిరపడాలనే సందేహం కలుగుతుందని వారి బంగారు భవిష్యత్తును తీర్చి దిద్దేందుకు చేపట్టిన …
Read More »మహిళలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం : మహిళా కమిషన్ సభ్యురాలు బూసి వినీత
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలపై దాడులకు పాల్పడితే ఎటువంటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ సభ్యురాలు బూసి.వినీత అన్నారు. శుక్రవారం రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు బూసి వినీత బాధితురాలిని పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై హాస్పిటల్ వైద్యులతో మాట్లాడిన అనంతరం భాదితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎటువంటి ఆందోళన చెందవద్దని అన్ని విధాలా అండగా ఉంటామని భాధితురాలికి మహిళా కమిషన్ సభ్యురాలు వినీత భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి …
Read More »అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలి…
-సచివాలయాల ద్వారా ప్రజల సమస్యలను పారదర్శకంగా పరిష్కరించాలి.. -జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ పర్యటించారు. గ్రామంలో పట్టా భూముల నందు రైల్వే అధికారులు సరిహద్దురాళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ ప్రాంతాన్ని జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లతో కలిసి పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ రెవెన్యూ, రైల్వే …
Read More »