విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ శుక్రవారం ఉప రాష్ట్రపతితో సమావేశమై విభిన్న అంశాలపై సమాలోచన జరిపారు. సమకాలీన అంశాలపై చర్చించారు. గవర్నర్ తో పాటు రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్ పి సిసోడియా, ఇతర అధికారులు ఉన్నారు. శనివారం గవర్నర్ హరి చందన్ విజయవాడ రాజ్ భవన్ కు చేరుకుంటారు.
Read More »Latest News
వినియోగదారుల రక్షణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగదారుల రక్షణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యులకు సూచించారు. డిస్టిక్ కంన్జుమర్ ప్రోటషన్ కౌన్సిల్ (జిల్లా వినియోగదారుల రక్షణ మండలి) తొలి సమావేశం శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పింగళివెంకయ్య సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వినియోగదారుల రక్షణ మండలి అధ్యక్షులు ఎస్. డిల్లీరావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారుల రక్షణకు ప్రభుత్వం 1986లో చట్టాన్ని …
Read More »ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సదస్సు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సదస్సు శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు కే బి శ్రీధర్, జాతీయ గౌరవ అధ్యక్షులు మాజీ మినిస్టర్ మూలింటి మారెప్ప, జాతీయ మహిళా విభాగం నాయకురాలు అంజనీ దేవి, రాష్ట్ర నాయకులు గంగిరెడ్డి, రాజా రామ్మోహన్ రెడ్డి, నంది కొండల రావు పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథి కే బి శ్రీధర్ మాట్లాడుతూ అణగారిన ప్రజల పార్టీ …
Read More »యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న యోగా పోటీలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో పి బి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నందు నిర్వహించిన 2వ రాష్ట్ర స్థాయి యోగాసన ఛాంపియన్ షిప్ పోటీల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ (నాని) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ భారత దేశం యోగ జన్మస్థలమని, శరీరం మరియు ఆత్మ కలయికే యోగా అని, యోగాసనాలతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, …
Read More »వార్డ్ వాలంటీర్ల పోస్ట్ లకు ఇంటర్వ్యూలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని వార్డ్ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వార్డ్ వాలంటీర్ల పోస్ట్ లకు శుక్రవారం డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య లు ఇంటర్వ్యూలు నిర్వహించారని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని వార్డ్ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్ట్ లకు ఆన్ లైన్ ద్వారా 204 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో కొందరికి సరైన ధ్రువ పత్రాలు …
Read More »అనుమతి లేకుండా వెంచర్లు లేదా లే అవుట్లు ఏర్పాటు చేస్తే వెంటనే తొలగింపు చర్యలు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అనుమతి లేకుండా వెంచర్లు లేదా లే అవుట్లు ఏర్పాటు చేస్తే వెంటనే తొలగింపు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి, ఐ.ఏ.యస్. పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టం చేశారు. శనివారం కమిషనర్ చౌడవరంలో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న లే అవుట్ ని తనిఖీ చేసి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వెంచర్లు అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తే …
Read More »వివిధ ప్రభుత్వ శాఖల వారికి స్వచ్ఛంద సంస్థల వారికి అభినందనలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దసరా ఉత్సవాలకు అన్ని విధములుగా సహకరించిన వివిధ ప్రభుత్వ శాఖల వారికి స్వచ్ఛంద సంస్థల వారికి, మీడియా ప్రతినిధులు, ప్రజలకు, పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి హృదయ పూర్వక అభినందనలు పోలీస్ కమీషనర్ తెలిపారు. విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ది.26.09.2022వ తేదీ నుండి ది.05.10.2022వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా జరిగిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకలను పురస్కరించుకుని దసరా పర్వదినంతో పాటు, మూలా నక్షత్రం, విజయదశమి, రోజుల్లో …
Read More »జిల్లాలో 112 సచివాలయాలలో ఆధార్ కేంద్రాలు : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రస్తుతం సచివాలయాలలో ఉన్న 87 ఆధార్ కేంద్రాలతో పాటు మరో 25 ఆధార్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని తప్పులకు తావులేని ఆధార్ అందించాలే వుండాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. శుక్రవారం మద్యాహ్నం జిల్లాకు చేరిన 25 ఆధార్ నమోదు ల్యాప్ టాప్ లతో పాటు 12 అనుసంధాన పరికరాలను జిల్లా కలెక్టర్ సచివాలయ సిబ్బందికి అందించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు, పాస్ పోర్ట్ వంటి అనేక పథకాలకు ఆధార్ కార్డు …
Read More »జీవనోపాధి కల్పించి మార్పు తీసుకుని రావాలి : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి మద్యం అక్రమ తయారీ నిరోధం పై చర్యలు చేపట్టి నాటు సారా తయారీ వృత్తి గా పలు మార్లు కేసులలో ఉన్న కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను కల్పించి వారిలో మార్పు తీసుకురావాలని ఆదేశించిన మేరకు జిల్లాలో ప్రస్తుతం గుర్తించిన 30 మందికి జీవనోపాధి మార్గాలకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి సంబందిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మద్యాహ్నం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు డి.ఆర్.డి.ఎ, ఎస్.ఈ.బి, ఎక్సైజ్, బ్యాంకర్స్ …
Read More »టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థకు సంబంధించిన జోనల్ ఆఫీసులలో పట్టాణ ప్రణాళిక సిబ్బంది వారు ది.07-10-2022 న ఫ్రై డే ఓపెన్ ఫోరం /LRS మేళను నిర్వహించినారు. సదరు మేళా లో ఆరుగురు ప్రజలు పాల్గొని పట్టాణ ప్రణాళిక శాఖకు సంబంధించి తమ సమస్యలను తెలియచేసి తమ అనుమానములను నివృత్తి చేసుకొనినారు. LRS కి సంబంధించిన పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయడమే ఈ మేళా యొక్క ముఖ్యోద్దేస్యమనియు మరియు ప్రభుత్వము వారు LRSకి …
Read More »