Breaking News

వార్డ్ వాలంటీర్ల పోస్ట్ లకు ఇంటర్వ్యూలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని వార్డ్ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వార్డ్ వాలంటీర్ల పోస్ట్ లకు శుక్రవారం డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకట కృష్ణయ్య లు ఇంటర్వ్యూలు నిర్వహించారని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని వార్డ్ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్ట్ లకు ఆన్ లైన్ ద్వారా 204 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో కొందరికి సరైన ధ్రువ పత్రాలు లేనందున వారి దరఖాస్తులు రిజెక్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ఆన్ లైన్ దరఖాస్తుల పరిశీలన అనంతరం 156 మందిని అర్హులుగా ప్రకటించగా వారిలో 88 మంది ఇంటర్వ్యూకి హాజరయ్యారని తెలిపారు. వాలంటీర్లుగా ఎంపికైన వారి ఫోన్ కి మెసేజ్ వస్తుందని, ఎంపిక కాబడిన వార్డు వాలంటీర్లు 11-10-2022 నుండి విధుల్లోకి చేరవలసియుండునని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *