విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: స్థానిక మొగల్రాజపురం సిద్ధార్థ కాలేజ్ ఎదురుగా “రాజ్ భోగ్ “సంపూర్ణ రెస్టారెంట్ ప్రారంభించబడినది. ఈ సందర్భంగా “రాజ్ బోగ్” నిర్వాహకులు చలువాది కృష్ణ మోహిత్, దీప్తి రాణి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో భోజనం ప్రియులకు మొట్టమొదటిసారిగా రాజస్థాన్, గుజరాత్, నార్త్ వంటకాలతో పూర్తి భోజనంరెస్టారెంట్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని 36 వంటకాలతోగుజరాత్ రాజస్థాన్ నార్త్ భోజనం 399/ రూపాయలకే అనుభవం ఉన్న చెఫ్ లతో భోజనం తయారు చేయించి ఈ రెస్టారెంట్లు లోఏర్పాటు చేయడం అయిందని అన్నారు …
Read More »Latest News
నగరంలో పల్సర్ ఎన్ 160 బైక్ ఆవిష్కరణ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: బజాజ్ ఆటో అధునాతన వెర్షన్ పల్సర్ ఎన్ 160 బైక్‌ను శుక్రవారం వరుణ్ బజాజ్, విజయవాడ షోరూంలో యం.వి.దుర్గారావు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అఫ్ పోలీస్ (కృష్ణలంక పిఎస్) ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బజాజ్ ఆటో ఏరియా సేల్స్ మేనేజర్ సదత్ బాషా మాట్లాడుతూ 160 సిసి సెగ్మెంట్‌లో డ్యూయల్ ఛానల్ ఎబిఎస్ ఫీచర్ ని భారతదేశంలోనే మొదటిసారి బజాజ్ ఆటో ప్రవేశపెట్టిందన్నారు. పి.వి.సత్యనారాయణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వరుణ్ బజాజ్ మాట్లాడుతూ ఈ బైక్‌ను 4 – స్ట్రోక్, 2-వాల్వ్, …
Read More »మహిళలు ఆర్థిక పురోగతిని సాధించాలన్నదే జగనన్న లక్ష్యం
-చేయూత వారోత్సవాలలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే ఆ దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కండ్రికలోని లగడపాటి కళ్యాణ మండపం నందు ఏడో రోజు జరిగిన వైఎస్సార్ చేయూత వారోత్సవాలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజా రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. అక్కచెల్లెమ్మలు చేసిన జై జగన్ జైజై జగన్ …
Read More »జగనన్న పాలనలో ప్రతి ఇంటి ముంగిటకు సంక్షేమ పథకాలు
-ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -57 వ డివిజన్ 234 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనతో ఇంటింటా సంతోషాలు వెల్లివిరుస్తున్నాయని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 57 వ డివిజన్ 234 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. …
Read More »అర్హులందరికి సంక్షేమ పథకాలు : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగనన్న పరిపాలనలో ప్రజలందరూ సురక్షితంగా ఉన్నారని ప్రతి ఒక్కరికి సంక్షేమ లబ్ది అందుతుంది అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 3వ డివిజన్ రామచంద్ర నగర్ మెయిన్ రోడ్,భాయన బాపూజీ రోడ్,ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ రోడ్ ప్రాంతాల్లో అవినాష్ ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల …
Read More »విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రక్తదాన శిబిరం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, విజయవాడ సిబ్బంది సమాజం పట్ల తమ బాధ్యతలో భాగంగా ఈరోజు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి ప్రారంభించారు. ఇతర సభ్యులను ఉత్సాహపరిచేందుకు ఆయన స్వయంగా రక్తదానం చేశారు. తమ సిబ్బందిని ప్రేరేపించడమే కాకుండా తన భార్యను కూడా రక్తదానం చేయడానికి ప్రేరేపించడం గొప్ప మానవతా విశేషంగా చెప్పవచ్చు. ఈ రక్తదాన శిబిరంలో గ్రౌండ్ మరియు అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది ముందుకు …
Read More »విద్యాంజలి 2.0 కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి
-పాఠశాల విద్యాశాఖ కమీషనర్& సమగ్ర శిక్షా ఎస్పీడీ ఎస్. సురేష్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత గల విద్యని అందించడానికి విద్యాంజలి 2.0, స్వచ్ఛంద సేవల కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టాము. సెప్టెంబర్ 7, 2021 న ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని పౌరులందరూ తమకు నచ్చిన రంగంలో సమీప పాఠశాలలకు స్వచ్ఛంద సేవలు అందించవచ్చును. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలలో విద్యానాణ్యతని పెంపొందించుకోవడానికి ఆర్జెడీలు …
Read More »యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు… : మంత్రి జోగి రమేష్
గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త: జగన్మోహనరెడ్డి ప్రభుత్వం గడిచిన మూడెళ్లలో రాష్ట్రంలో దశాబ్ధాలుగా పేరుకుపోయిన సమస్యలన్నింటిని విప్లవాత్మకంగా పరిష్కరిస్తుందని, ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. శుక్రవారం కృష్ణాజిల్లా పెడన టౌన్ లోని సెయింట్ విన్సెంట్ పల్లోటి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆడిటోరియంలో మెగా జాబ్ మేళాను మంత్రి శుక్రవారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి సంస్థ, డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, …
Read More »ఫ్రై డే ఓపెన్ ఫోరం /LRS మేళ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ నగర పాలక సంస్థకు సంబంధించిన జోనల్ ఆఫీసులలో పట్టాణ ప్రణాళిక సిబ్బంది వారు శుక్రవారం ఫ్రై డే ఓపెన్ ఫోరం /LRS మేళను నిర్వహించినారు. సదరు మేళా 12 మంది ప్రజలు పాల్గొని పట్టాణ ప్రణాళిక శాఖకు సంబంధించి తమ సమస్యలను తెలియచేసి తమ అనుమానములను నివృత్తి చేసుకొనినారు. LRS కి సంబంధించిన పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయడమే ఈ మేళా యొక్క ముఖ్యోద్దేస్యమనియు మరియు ప్రభుత్వము వారు LRSకి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించే నిమిత్తము 31-10-2022 …
Read More »వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ల పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్దం చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త: నగరంలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ల పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్దం చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ తమ చాంబర్ లో నగరంలో జరుగుతున్న, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నాడు-నేడు పనులు, తదితర అంశాల పై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణ పనులు వేగంగా …
Read More »